వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ కార్డ్: అమెరికాలో రోడ్డెక్కిన భారతీయ ప్రొఫెషనల్స్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా సోమవారం వందలాది మంది భారతీయ ఉద్యోగులు, నిపుణులు ర్యాలీలు నిర్వహించారు. అమెరికా పౌరసత్వమైన గ్రీన్‌కార్డుల జారీకి బాగా జాప్యం జరుగుతోందని, వీటి జారీకి దేశాల వారీ పరిమితి ఎత్తేయాలని కోరుతూ వారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

కెంటస్కీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ర్యాలీలో దాదాపు 300మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు పాల్గొన్నారు.

 భారతీయుల ఆవేదన

భారతీయుల ఆవేదన

వందలాదిగా పాల్గొన్న భారతీయ ఉద్యోగులు, నిపుణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అత్యధికంగా హెచ్‌1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

 పెద్ద ఎత్తున ర్యాలీ

పెద్ద ఎత్తున ర్యాలీ

దేశాల వారీ కోటాను ఎత్తేయాలని అక్కడి భారతీయులు ఆయా ప్రాంతాల్లోని శాసనకర్తల మద్దతు కోరుతూ ర్యాలీలు చేశారు. ముఖ్యంగా అర్కాన్సాస్‌, కెంటుస్కీ, ఓరెగావ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.

 భారతీయులకు తీవ్ర ఇబ్బందులు

భారతీయులకు తీవ్ర ఇబ్బందులు

దేశాల వారీ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంపై అమెరికన్లకు, శాసనకర్తలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాలీ నిర్వహకులు తెలిపారు.

 ఈ కాలానికి సరిపోవు

ఈ కాలానికి సరిపోవు

ఎప్పుడో లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నిబంధనను పెట్టారని, ఈ కాలానికి ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. లిండన్‌ జాన్సన్‌ 1963 నుంచి 1969వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, కాగా, అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు చాలా మంది గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని వేచి చూస్తున్నారు. దేశాల వారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

English summary
Hundreds of Indian professionals held peaceful rallies across the US, demanding an end to the long and massive green card backlog by eliminating arbitrary per-country limit regulations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X