వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమన్‌లో భారత ఫ్రొఫెసర్ మృతి

|
Google Oneindia TeluguNews

Indian professor found dead in Oman
మస్కట్: భారతదేశానికి చెందిన ఓ కెమిస్ట్రీ ఫ్రొఫెసర్ అతను విధులు నిర్వహిస్తున్న ఒమన్‍‌లోని విశ్వవిద్యాలయంలోనే మృత్యువాత పడ్డాడు. సుల్తాన్ కుబూస్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న హిషం అబ్దుల్ ఖాదర్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

ప్రొఫెసర్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. హిషం అబ్దుల్ ఖాదర్ ఒంటరిగానే నివాసం ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి తాము 10.30 గంటల ప్రాంతంలో అతని గదికి వెళ్లినట్లు హిషం సన్నిహితులు తెలిపారు. ఆ సమయంలో తన గదిలోనే హిషం అబ్దుల్ ఖాదర్ మృతి చెంది ఉన్నాడని వారు చెప్పారు.

అతని టేబుల్‌పై భోజనం కూడా వడ్డించి ఉందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో హిషం సాయంత్రం నడక కోసం బయటికి వచ్చారని పలువురు తెలిపారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హిషం భారతదేశంలోని అతని భార్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు.

హిషం అబ్దుల్ ఖాదర్‌కు హృదయ సంబంధమైన వ్యాధి ఉన్నట్లు అతని స్నేహితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య.. భారతదేశంలోని కేరళ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు మృతుని నివాసానికి సీల్ వేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 57-year-old Indian chemistry professor has been found dead at his university campus residence in Oman. Hisham Abdul-Khader, an associate professor in the chemistry department in Sultan Qaboos University, was found dead last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X