వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో సిక్కు వ్యక్తిపై అకారణంగా శ్వేతజాతీయుడి దాడి

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్‌ పార్లమెంట్ వద్ద భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తిపై దాడి జరిగింది. ఓ శ్వేత జాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన ముప్పై ఏడేళ్ల రవ్‌ణీత్‌ సింగ్‌ పోర్ట్‌కుల్లిస్‌ హౌస్‌ వద్ద సిక్కు ఎంపీ తన్‌మన్‌జీత్‌ సింగ్‌‌ను కలిసేందుకు వచ్చారు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన శ్వేతజాతీయుడు... రవ్‌ణీత్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై దాడి చేసి టర్బన్‌ను లాగివేశాడు. ముస్లిం గో బ్యాక్‌ అంటూ గట్టిగా కేకలు వేస్తూ దాడికి పాల్పడ్డాడు.

దీనిపై రవ్‌ణీత్ మాట్లాడుతూ.. పోర్ట్‌కుల్లిస్‌ హౌస్‌ ఎదుట క్యూలో నిలబడ్డానని, సదరు వ్యక్తి తన దగ్గరకు వచ్చి అకారణంగా గొడవ పడ్డాడని, తనపై దాడి చేసి తన టర్బన్‌ను గట్టిగా లాగేశాడని, అది కొద్దిగా ఊడిపోతుంటే తాను వెంటనే దానిని పట్టుకున్నానని, తాను గట్టిగా ఎదురు తిరిగి అరిచే సరికి అతడు పారిపోయాడని చెప్పారు.

జాత్యాంహకార మాటలు కొన్ని మాట్లాడాడని, ముస్లిం గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశాడని, అతడు శ్వేతజాతీయుడే కానీ, ఇంగ్లీష్‌లో మాట్లాడలేదని, వేరే భాషలో మాట్లాడి పారిపోయాడని చెప్పారు. కాగా ఈ దాడిని ఎంపీ తన్‌మన్‌జీత్‌ సింగ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు దాడిని ధ్రువీకరించారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Police are investigating an alleged racist attack after a Sikh man queuing outside Parliament had his turban ripped from his head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X