వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో దాడి: కోమాలో భారత విద్యార్థి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Indian student
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు మళ్లీ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన ఓ విద్యార్థి కోమాలోకి వెళ్లిపోయాడు. స్నేహితుడితో కలిసి మన్రియాజ్విందర్ సింగ్ అనే 20 ఏళ్ల విద్యార్థి ఫుట్‌పాత్‌పై నిలబడి ఉండగా, 8 మంది దుండగులు వచ్చి దాడేశారు.

ఇద్దరినీ కూడా తీవ్రంగా కొట్టి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కుని వెళ్లారు. ఆ దాడికి సంబంధించి సిసిటివీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోమాలోకి వెళ్లిన విద్యార్థితో పాటు అతని స్నేహితుడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దుండగులు అఫ్రికావాళ్ల మాదిరిగా ఉన్నారని, ఓ కాకేసియన్ మహిళ కూడా వారిలో ఉందని డిటెక్టివ్ సీనియర్ కానిస్టేబుల్ ఆడం ఫోలే చెప్పారు. విద్యార్థిని దవడలపై గట్టిగా గుద్దారని, దాంతో వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడని చెప్పారు.

కిందపడిన తర్వాత కూడా వారు అతన్ని వదిలిపెట్టలేదని, తన్నుతూ కొట్టారని, మహిళ కర్ర తీసుకుని దాడి చేసిందని చెప్పారు. ఆదివారంనాడు ఆ సంఘటన జరిగింది.

English summary
An Indian student studying in Australia is in coma after being attacked by a group on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X