వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

|
Google Oneindia TeluguNews

Indian student found dead in Sharjah
దుబాయ్: షార్జాలో విద్యనభ్యసిస్తున్న ఓ భారతీయ యువతి (22) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. యువతి మృతికి గల కారణాలను విచారించేందుకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పోలీసులు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతి చెందిన ఓ యువతిని తన తండ్రి తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్చారని తూర్పు ప్రాంత పోలీసులకు సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం పడక గదిలో తన కూతురు ఉరి వేసుకుని ఉండటాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైనట్లు యువతి తండ్రి పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత యువతి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృతి చెందిన యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె మెడకు తాడు బిగించి ఉన్నట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణ కోసం ఓ సిఐడి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.

పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. షార్జాలోని ఫుజైరాహ్ కాలేజిలో ఆ యువతి విద్యనభ్యసిస్తోందని పోలీసులు తెలిపారు.

English summary
A 22-year-old Indian woman student was found dead in mysterious circumstances in Sharjah, prompting the UAE police to launch a probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X