• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

|

లండన్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త దివంగత ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు బహ్రెయిన్, లండన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టిఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అద్యక్షుడు, తెలంగా ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి దూసరి అశోక్ గౌడ్, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లండన్ ఇన్‌ఛార్జ్ రత్నాకర్ కడుడుల, ముఖ్య నాయకులు హరి నవపేట్, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, శ్రీకాంత్ పెద్డిరాజు, ప్రవీణ్ కుమార్, రమేశ్ ఈశంపల్లి, సత్యం కంది, జెటీఆర్ డిసి యూకే ఛైర్మన్ సృజన్ రెడ్డి చాడా, ఐటీ జ్యాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, టిడిఆఫ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పింగళి, శ్రీకాంత్, ఇతర తెలంగాణా వాదులు చిత్తరంజన్ రెడ్డి, శ్రీధర్ నైనకంటి, రోహిత్ రేపక, తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

బహ్రెయిన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యం లో మనామా సెగయ మెగా మార్ట్‌లో తెలంగాణా జాతిపితగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, జయశంకర్ సార్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంఛార్జ్ బొలిశెట్టి వెంకటేష్‌లు మాట్లాడుతూ.. 'ఈరోజు ఇంతగొప్ప తెలంగాణా జాతిపితగా ఆచార్యుడిగా, అధ్యాపకుడిగా, మేధావిగా, విశ్లేషకుడిగా, ఆయన తెలంగాణా మాగాణానికి చేసిన సేవలు అపురూపం' అని కొనియాడారు. అందుకే ఆయన మన గుండెల్లో నిలిచారని అన్నారు.

బహ్రెయిన్ దేశంలో ఉన్నా సార్ జయంతి నిర్వహించుకుంటున్నందుకుచాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి, ఐదు దశాబ్ధాలకు పైగా మడమ తిప్పని గొప్ప పోరాట యోధుడిగా ప్రొ. జయశంకర్ సార్ నిలిచారని అన్నారు. సార్ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.

'నా బలం.. బలహీనత తెలంగాణే'అని జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి, విముక్తి కోసం తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పోరాటం చేసిన యోధుడు. తెలంగాణ రాష్ట్రం ఏనాటికైనా వచ్చి తీరుతుందని గట్టినమ్మకంతో చెప్పిన వ్యక్తి జయశంకర్ సార్. అయన అరవై ఏళ్ళ కాలంలో ఏనాడూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచమంతా వినిపించిన నేత. చివరకు తెలంగాణ సాకారమైన క్షణాలను చూడకుండానే దివికేగాడు' అని చెప్పారు.

'జయశంకర్ సార్ ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు ఉంటాయి. ఆయన కలలుగన్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే
మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. దీనికి తన శాయశక్తులా పరితపిస్తూ నిర్విరామంగా అభివృద్ధి సాధిస్తున్న సీఎం కేసీఆర్‌‌ని ఈ సందర్బంగా అభినందిస్తున్నాము' అని వారు తెలిపారు.

'బంగారు తెలంగాణబాటలో జయశంకర్ సార్ మనతో లేకున్నా.. సార్ కోసం బంగారు తెలంగాణ చేద్దాం' అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోడా. రవి, చైతన్య, ప్రశాంత్, సుమన్, రవి, రాజేశ్వర్ గౌడ్, గంగన్న, రాజేష్, ప్రకాష్, గట్టన్న, సుధాకర్,గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త దివంగత ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు బహ్రెయిన్, లండన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టిఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ఎన్నారై టిఆర్ఎస్ సెక్రెటరీ నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ సార్‌ని స్మరిస్తూ రెండు నిమిషాలుమౌనం పాటించారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ఆ తర్వాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్రాగొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేశారని అన్నారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

అలాంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటైన సంతోష సందర్భంలో మన
వద్దు లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అనుకున్న ఆశయ సాధనకై వారు చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ప్రవాస తెలంగాణ సంఘాలు అన్న ఆచార్య గారి మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

English summary
Prof. Jayashankar Sir Jayanthi 2016 celebrations held by NRI TRS CELL UK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X