వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహ్రెయిన్‌లో నేలరాలిన తెలంగాణ బిడ్డ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..

కామారెడ్డికి చెందిన మార్కంటి బాబు బహ్రెయిన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.టీఆర్ఎస్ ఎన్నారై సభ్యుల చొరవతో అతని పార్థివ దేహాన్ని ఇండియా తరలించారు.ఇందుకోసం టీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు అన్ని

|
Google Oneindia TeluguNews

బహ్రెయిన్: తెలంగాణ యువకుడు కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్ పోర్ట్ నెంబర్ M9743802, బహరేన్ లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో గత 10 సంవత్సరాల నుండి లేబర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

తేదీ 8 ఆగస్ట్ 2017న ఉదయం 06:00 గంటలకు డ్యూటీ టైంలో రోడ్ క్రాస్ చేస్తుండగా అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. వారి అకాల మరణం చాల బాధాకరం, మృతిచెందిన బాబుకు, భార్యతో పాటు ఒక కూతురు, ఒక కుమారుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

Kamareddy man killed in road accident in Bahrain

మార్కంటి బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయాన్ని అతని తోటి కంపెనీ లో పని చేస్తున్న స్నేహితులు సాయన్న, ఆంజనేయులు, ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వెంటనే స్పందించారు.

బాబు పనిచేసిన కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడి అతని పార్థివ దేహంతో పాటు మరో వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇండియాకు పంపించారు. తేదీ 22.8.17న రాత్రి గల్ఫ్ఎయిర్ ప్లయిట్ నెం. GF274 ద్వారా బహరేన్ నుండి బయలు దేరి 23.8.17 ఉదయం 09:30గం లకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు పంపించారు.

Kamareddy man killed in road accident in Bahrain

ఎయిర్‌ పోర్ట్‌ నుండి స్వగ్రామానికి తరలించడానికి టీఆర్ఎస్ నిజామాబాదు ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి మరియు బాబురావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

వారి ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, సాయన్న, తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.

English summary
Markanti Babu who is working in Bahrain was killed in road accident on August 8th. TRS NRI cell members helped them to send dead body to India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X