వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ఘ‌నంగా కేసీఆర్ - దీక్షా దివస్

తెలంగాణ ఉద్యమం సందర్బంగా కేసీఆర్ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ లండన్ లో కేసీఆర్ దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

లండన్‌ : కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన 'కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల' సందర్బంగా అభిప్రాయపడ్డారు.

నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా
బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటూ, లండన్ లో భారత హైకమిషన్
దగ్గరున్న నెహ్రూ విగ్రహం దగ్గర నుండి, సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్
స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు ఎన్నారై టీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శాంతి యాత్ర నిర్వహించారు.

 KCR deeksha divas celebrated grandly in london by TRS NRI sell

కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు యు.కే నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలతో నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. లండన్ వీధుల మీదుగా ప్రారంభమైన శాంతి యాత్ర.. జై తెలంగాణా, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగింది.

మార్గమద్యలో కార్యక్రమ ఉద్దేశ్యాన్ని అడిగి తెలుసుకొన్న ఎంతో మంది విదేశీయులు.. తన ప్రజల కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటపటిమను ప్రశంసించారు.

చివరిగా శాంతి యాత్ర సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం
వద్దకు చేరుకున్న తరువాత గాంధీజీ విగ్రహానికి పూలతో నివాళార్పించి, తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎన్నారై
టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. సరిగ్గా ఏడు
సంవత్సరాల క్రితం 'తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో' అనే నినాదం తో తల పెట్టిన దీక్ష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు.

 KCR deeksha divas celebrated grandly in london by TRS NRI sell

తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమం లో తన ప్రాణాలను పణంగా పెట్టి
సకల జనలును ఏకం చేసి, శాంతి యుత పోరాటాం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి
ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.

నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ జీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ - కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధానోద్యమంలో ఎటువంటి హింసకు తావు
లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత
దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్ మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత
నాయకుడు మన కేసీఆర్ గారని ప్రశంసించారు.

 KCR deeksha divas celebrated grandly in london by TRS NRI sell

ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన
అదృష్టమని. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలు చాతనాయతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే
రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెప్తామని, సరయైన సందర్భం
లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్తారనితెలిపారు.

చివరిగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. లండన్ నుండి కెసిఆర్ గారు
తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్
టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్
రెడ్డి,లండన్ ఇంచార్జ్ రత్నాకర్కడుదుల,సభ్యులు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి చాడా, శ్రీకాంత్
పెద్డిరాజు, సురేష్ బుడగం , సతీష్ రెడ్డి బండ, సెరు సంజయ్, సత్యం రెడ్డి కంది,వినయ్ ఆకుల, నవీన్ భువనగిరి, ,సత్య చిలుముల,రవి ప్రదీప్, చిత్తరంజన్ రెడ్డి, రవి రావు,అశోక్,రవి
కిరణ్, వెంకీ, శ్రీనివాస్ హాజరైన వారిలో ఉన్నారు.

English summary
KCR deeksha divas event was grandly celbrated in london by TRS NRI cell. Lot of people from the country were attended to event to make it success
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X