వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు ఎన్నారైల లేఖలు: కోదండరామ్ మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్ : లండన్లో టీజాక్ తలపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు లండన్ ఎన్నారైలు లేఖలు రాసి పోస్ట్ చేశారు.

టీ జాక్ చైర్మన్ కోదండరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. పోస్టు కార్డు ఉద్యమానికి ఎన్నారైల మద్దతు మద్దతు హర్షణీయమని ఆయన అన్నారు . ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ,నియామకాల కాలెండర్ విడుదల చేయాలనీ, నిరుద్యోగ భృతి కల్పించి యువత కు న్యాయం చేయాలని కోరుత ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలపాలని పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు

Kodandaram speaks with London NRI through video

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రంగు వెంకట్ మాట్లాడుతూ - తెలంగాణ ఏర్పాటుకు నియమాకాలు ప్రధాన అంశమని, తెలంగాణ ఏర్పాటు అయితే లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయని యువత ఎంతో ఆశతో ఏదురు చూసిందని, నాలుగేళ్లు కావస్తున్నా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని అన్నారు.

ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలనీ , ఉద్యోగ భృతి ని కల్పించాలని లండన్ నుండి ముఖ్యమత్రికి లేఖలు పంపి టీజాక్ పోస్టుకార్డు ఉద్యమానికి మద్దతు తెలిపామని ఆయన అన్నారు రవి కూర మాట్లాడుతూ- ఉద్యోగాలు నియామకం చేసే టిఎస్‌పిఎస్సీ లోనే ఖాళీలు భర్తీచేయక పోవడం హాస్యాస్పదమని అన్నారు.

Kodandaram speaks with London NRI through video

మహేష్ చాట్ల మాట్లాడుతూ - ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం విస్మరించడం సరైనది కాదని, నాలుగేళ్లలో ఏడుగు ఉద్యోగాలు మాత్రమే నియామకం జరిగిందని, నోటిఫికేషన్ ప్రక్రియల్లో లోపాల వల్ల కూడా యువత ఇబ్బంది పడ్డారని అన్నారు . రాజు కొయ్యడ మాట్లాడుతూ- ప్రగతి భవన్‌ కు చేరుతున్న గుట్టల కొద్దీ ఉత్తరాలతోని ఐన ముఖ్యమంత్రికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

Kodandaram speaks with London NRI through video

ఈ కార్యక్రమం లో తిరుపరి నర్సింహా రెడ్డి , కొలను విద్యా భూషణ్, గుర్రం మల్లారెడ్డి, పుప్పాల రాజు, మధు, గుమ్మడవెల్లి రమేష్, నాయిని శైలజ, నా యిని సురేందర్ రెడ్డి, ఆకుల వెంకట స్వామి పాల్గొని లండన్ నుండి ముఖ్యమంత్రికి 12 లేఖలు రాశారు.

English summary
London NRIs have written letters to Telangana CM K chadrasekhar Rao demanding fillup the pots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X