వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హూస్టన్ ఉగాది సాహిత్య సమ్మేళనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హూస్టన్: 'శ్రీ దుర్ముఖి' నామ ఉగాది సందర్భంగా హ్యూస్టన్ మహా నగరంలో తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 30న నిర్వహించిన ఉగాది సాహిత్య సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ సుదీర్ఘ సాహిత్య కార్యకమానికి ఆస్టిన్, శాన్ఏంటోనియో, డల్లాస్ టెంపుల్ నగరాల నుండి కూడా 150 మందికి పైగా తెలుగు సాహిత్యాభిమానులు తరలి వచ్చారు.

'శ్రీ దుర్ముఖి' నామ ఉగాది సందర్భంగా హ్యూస్టన్ మహా నగరంలో తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 30న నిర్వహించిన ఉగాది సాహిత్య సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ సుదీర్ఘ సాహిత్య కార్యకమానికి ఆస్టిన్, శాన్ఏంటోనియో, డల్లాస్ టెంపుల్ నగరాల నుండి కూడా 150 మందికి పైగా తెలుగు సాహిత్యాభిమానులు తరలి వచ్చారు.

Literary compound held in Houston

దీప్తి పెండ్యాల స్వాగత వచనాలతో, చిన్నారులు అలకనంద, గాయత్రి, సంహితప్రార్ధనా గీతం శ్రావ్యంగా ఆలపించగా సభా ప్రారంభం శుభప్రదంగా జరిగింది. వంగూరి చిట్టెన్ రాజు తమ కీలకోపన్యాసంలో ఉగాది సాహిత్య సమ్మేళనం విశిష్టతని వివరించారు.

ప్రధాన అతిథి సుప్రసిద్ద కవి, అనువాదకులు డా. ముకుంద రామారావు (హైదరాబాద్) "వలస వేదన -నా కవిత్వం"అనే అంశం మీద సభికులకి ఎంతో ఆసక్తికరమైన ప్రసంగం చేశారు.

లభ్ద ప్రతిష్టులైన ప్రత్యేక ఆహ్వానితులు న్యూ జెర్సీ వాస్తవ్యులు తమ్మినేని యదుకుల భూషణ్ "సీపీ బ్రౌన్ జీవితం, సేవలు" అనే అంశం, సౌత్ కెరోలైనా వాస్తవ్యులు విన్నకోట రవిశంకర్ "అనువాద కవిత్వం", డాలస్ నివాసి చంద్ర కన్నెగంటి "కథ మారుతుందా?" అనే అంశం, డాలస్ వాస్తవ్యులు ప్రొ. పూడూర్ జగదీశ్వరన్"అల్లసాని జిగిబిగిలు-జగదీశ్వరన్ మల్లియలు" అనే అంశం, ఆస్టిన్ నుంచి వచ్చిన సత్యం మందపాటి 'కాదేదీ కథకనర్హం' అనే అంశం గురించి చక్కటి ప్రసంగాలు చేశారు.

చెన్నై వాస్తవ్యులు, సుప్రసిద్ధ పాత్రికేయులు, రేడియో ప్రయోక్త డా. పిఎస్ గోపాల కృష్ణ "ఏ మాట కా మాట" అనే అంశం మీద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల ఉన్న మాటల స్వారూప్యత మీద అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.

Literary compound held in Houston

రెండు విడతలు గా జరిగిన స్వీయ రచనా విభాగంలో రవి పొన్నపల్లి, దేవగుప్తాపు శేషగిరి రావు, ఉమా పోచంపల్లి, ఉమా భారతి, శ్రీదేవి జోశ్యుల, శ్రియ పెండ్యాల ఆంగ్ల కవిత, తుమ్మల కుటుంబ రావు, రాజేశ్వర్ టేక్మల్, నాగ అంబటిపూడి, మల్లికార్జున్ పాల్గొన్నారు.

ఈ సాహిత్య సమ్మేళనంలో కవి ముకుంద రామారావు గారి "అదే గాలి" బృహత్ గ్రంథాన్ని గోపాల కృష్ణ పరిచయం చేయగా, ఆయన రచనలని విన్నకోట రవిశంకర్ విశ్లేషించారు. వంగూరి చిట్టెన్ రాజు ఆవిష్కరించారు. పద్మ దేవగుప్తాపు విరచిత "పద్మ పద్య వాహిని" గ్రంధాన్ని శాన్ ఏంటోనియో నివాసి మాధవ రావు, టెంపుల్ నివాసి గిరిజా శంకర్, కేటీ నివాసి చిలుకూరి సత్యదేవ్ లు పరిచయం చేశారు.

తమ్మినేని యదుకుల భూషణ్ గత పదేళ్ళగా అనువాదం, కవిత్వం, భాషా సేవలకి గుర్తింపుగా ప్రదానం చేస్తున్న "సీపీ బ్రౌన్ పురస్కార ప్రదానం" ఈ ఏడు శ్రీ ముకుంద రామారావుని ఎంపిక చేశారు. ఈ సాహిత్య సమ్మేళనంలో ఆ ప్రతిష్టాత్మక పురస్కార జ్ఞాపిక, నగదు బహుమతి వంగూరి చిట్టెన్ రాజు, విన్నకోట రవిశంకర్ చేతుల మీదుగా శ్రీ ముకుంద రామారావు గారు అందుకున్నారు.

యదుకుల భూషణ్, మధు పెమ్మరాజు కవిని సత్కరించారు. తదుపరి అంశంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 21వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతలైన స్థానిక రచయిత్రులు ఉమా భారతి, శ్రీదేవి జోశ్యుల ప్రశంసా పాత్ర బహుకరణ శాయి రాచకొండ చేతుల మీదుగా జరిగింది.

సభకి పరాకాష్టగా ఉగాది సాహిత్య సమ్మేళన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆహ్వానిత అతిథులు అందరికీ వేదిక మీద పారితోషికాలతో చిరు సత్కారం జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకూ అద్వితీయంగా, ఆప్యాయ వాతావరణం లో జరిగిన ఈ సాహిత్య సమ్మేళనాన్ని చిలుకూరి సత్యదేవ్, మధు పెమ్మరాజు అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలనీ అందుకున్నారు.

శ్రీనివాస్ పెండ్యాల సముచితంగా చేసిన వందన సమర్పణ తో సభ దిగ్విజయంగా ముగిసింది. ఈ సభ కి "స్వరం ఆడియో" కర్రా శ్రీనివాస్ ఆడియో ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించగా, విశాల రెస్టారెంట్ వారు భోజన సదుపాయాలు సమకూర్చారు.

'శ్రీ దుర్ముఖి' నామ ఉగాది సందర్భంగా హ్యూస్టన్ మహా నగరంలో తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 30న నిర్వహించిన ఉగాది సాహిత్య సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది.

English summary
Literary compound held in Houston in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X