లైవ్ విత్ వైయస్ షర్మిల

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు ఈ నెల 16వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి సాక్షి టీవి లైవ్‌లో పాల్గొంటారు. అమెరికా కాలమానం ప్రకారం మే 15వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి ఆమె షెరటాన్ కెరిటోస్ హోటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని వైయస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 150కి పైగా అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నరు.

YS Sharmila

వైయస్ షర్మిల జగనన్న వదిలిన బాణాన్నంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో ప్రజా ప్రస్థానం పేరిట 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజుల పాటు చేపట్టి చరిత్ర సృష్టించారు.

తన మరో ప్రజాప్రస్థానం యాత్రను 2012 అక్టోబర్ 18వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగించారు. రాష్ట్రంోలని 14 జిల్లాలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది కార్పోరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+