India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్యంలో శ్రీనివాస కల్యాణం.. విశేష సేవలు.. పాల్గొన్న వైవీ దంపతులు

|
Google Oneindia TeluguNews

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అగ్రరాజ్యం అమెరికాలో ఘనంగా జరిగింది. 25వ తేదీ శనివారం రోజున డాలస్‌లో గల క్రెడిట్‌ యూనియన్ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా కన్నుల పండువగా సాగింది. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు 12 వేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా కదిలివచ్చిన జనసమూహం తమకు దక్కిన అవకాశానికి తన్మయులవుతున్నారు. స్టేడియాన్ని గుడిలా మార్చడంపై అభినందనలు వెల్లువెత్తాయి.

 సేవలో తరించి..

సేవలో తరించి..

టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులతోపాటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కడప జడ్పీ చైర్‌పర్సన అమర్‌నాథ్‌ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్‌రెడ్డి కార్యక్రమానికి హాజరైసేవల్లో పాల్గొన్నారు. టీపాడ్‌ ప్రతినిధులు టీటీడీ అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో మొదలుపెట్టి, తోమాల సేవ, అభిషేక సేవ ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించిన సేవల్లో పాల్గొన్న వారికి టీపాడ్‌ నిర్వాహకులు ఒక్కో సేవను అనుసరించి వేర్వేరుగా లడ్డూ ప్రసాదం, వస్త్రం, ఐదు గ్రాముల బంగారు నాణెం, వెండి నాణెం, కంచిపట్టు చీర, పట్టు దోతీ, గద్వాల్‌ పట్టుచీర, పట్టు దుపట్టా, బ్లౌజ్‌ పీస్‌తోపాటు వీఐపీ బ్రేక్‌ దర్శన భాగ్యం కల్పించారు.

 కంకణధారణ చేసి

కంకణధారణ చేసి


ముందుగా దేవేరులకు కంకణధారణ చేశారు. శ్రీనివాసుడు ఇక్కడే మనసు లగ్నం చేసేలా మనోజపం చేస్తూ పూజలను మనోరంజకంగా చేశారు. ఇంతటి దర్శన, సేవాభాగ్యం కలగడం పట్ల తెలుగువారంతా పులకించిపోయారు. టీపాడ్‌ నిర్వాహకులకు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఆమెరికాలో ఉన్న తెలుగువారందరికీ పద్మావతి అలిమేలు సమేత తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం, ఏపీ నాన్ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సమన్వయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 9 నగరాల్లో అంకురార్పణ

9 నగరాల్లో అంకురార్పణ


తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలో గల తొమ్మిది నగరాల్లో శ్రీనివాస కల్యాణానికి అంకురార్పణ చేసింది. జూన 25న డాలస్‌ వేదికగా స్వామి వారి కల్యాణం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి పేర్కొంది. అమెరికా నగరాల్లో శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న కల్యాణం నిర్వహించాలనే ఆలోచన రావడంతో ఆంధప్రదేశ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ నాన్ రెసిడెంట్‌ తెలుగు అసోసియేషన బృందంతో చర్చలు జరిపింది. డాలస్‌లో టీపాడ్‌కు అవకాశం ిచ్చిన నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటికి టీపాడ్‌ కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డికి, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డికి, టీటీడీ అర్చకులు, పండితులకు, ఏపీ ఎన్ఆర్‌టీ చైర్మన్ వెంకట్‌ మేడపాటికి టీపాడ్‌ ధన్యవాదాలు తెలిపింది.

అభినందనలు

అభినందనలు


కార్యక్రమ నిర్వహణను సుగమం చేసిన టీపాడ్‌ ముఖ్యులు రఘువీర్‌ బండారును వేడుకకు హాజరైన తెలుగువారందరూ అభినందించారు. లాజిస్టిక్‌ సహకారం అందించిన తిరుపతికి చెందిన ప్రొఫెసర్‌ భాను సేవలను కొనియాడారు. అజయ్‌ రెడ్డి, రావు కల్వల సలహాదారులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి రమణ లష్కర్‌, ఇందు పంచెర్పుల, అశోక్‌ కొండల, రఘువీర్‌ బండారు, రామ్‌ అన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్‌ కలసాని, విజయ్‌ తొడుపునూరి, చంద్రారెడ్డి పోలీస్‌, కరణ్‌ పోరెడ్డి, పాండురంగారెడ్డి పాల్వాయి, రవికాంత రెడ్డి మామిడి స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ఉంటూ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేశారు.

 సమిష్టిగా..

సమిష్టిగా..


వివిధ కమిటీలకు చైర్స్‌గా వ్యవహరించిన నరేష్‌ సుంకిరెడ్డి, బాల గంగవరపు, స్వప్న తుమ్మపాల, మంజుల తొడుపునూరి, రూప కన్నయ్యగారి, మధుమతి వ్యాసరాజు, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, లక్ష్మీ పోరెడ్డి, శ్రీనివాస్‌ అన్నమనేని, రత్న ఉప్పల, శ్రీధర్‌ వేముల, రేణుక చనుమోలు, జయ తెలకపల్లి, శ్రీనివాస్‌ తుల, లింగారెడ్డి ఆల్వా, సుమన బసని, రోజా ఆడెపు, గాయత్రి గిరి, మాధవి మెంట, శ్రీనివాస్‌ రెడ్డి పాలగిరి, వెంకట్‌ అనంతుల, వీర శివారెడ్డి, రవీంద్రనాథ్‌ ధూలిపాల, సంతోషి విశ్వనాథుల, రాజా వైశ్యరాజు, అభిషేక్‌ రెడ్డి కార్యక్రమం విజయవంతానికి ఎనలేని కృషి చేశారు.

 సత్కారం

సత్కారం


తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులను, అర్చకులు, పండితులను టీపాడ్‌ అధ్యక్ష కార్యదర్శులు విశేష రీతిలో సత్కరించారు.
డాలస్‌లోని క్రెడిట్‌ యూనియన ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరై పద్మావతీ అలివేలు సమేత వెంకన్ననను దర్శనం చేసుకున్న వారందరికీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.

English summary
lord srinivasa kalyanam done at america dallas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X