వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరదలు: కేరళ సీఎం సహాయనిధికి మలేసియా తెలంగాణ అసోసియేషన్ విరాళం
కౌలాలంపూర్/హైదరాబాద్: ఇటీవల భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
అతలాకుతలమైన కేరళకు ఎంతోమంది తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మలేసియాలోని తెలంగాణవాసులు కూడా తమ వంతుగా కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.


మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తనవంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.37,600 విరాళం అందించింది. ఈ మేరకు MYTA అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కేరళను తిరిగి అందమైన రాష్ట్రంగా మార్చుకోనేందుకు, కేరళ ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు.