• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీట్ అండ్ గ్రీట్ విత్.. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

|

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ - యూకే మరియు హైద్రాబాద్ అసోసియేషన్ యూకే సంయుక్తంగా లండన్ లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణ డిప్యూటీ సీ యం - మహమూద్ అలీ' కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమం లో స్థానిక ల్యామ్ బెత్ మేయర్ సాలేహా జాఫర్, మాజీ హౌన్‌స్లా మేయర్ నసీర్ మాలిక్ అతిదులుగా హాజరయ్యారు యు.కే నలుమూలల నుండి భారీగా వివిద సంస్థల ప్రతినిదులు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి మరియుహైద్రాబాద్ అసోసియేషన్ యూకే ఉపాద్యక్షులు షానవాజ్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ... ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించి , అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి,

అతిథులకు వివరించారు. మహమూద్ అలీ గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని

తెలిపారు, బంగారు తెలంగాణ నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు,

మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి

సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి రెవెన్యూ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా

పనిచోస్తోందని, సాక్షాత్తూ ప్రదాని మోడి గారు, ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చినప్పుడు

ప్రశంసించారని తెలిపారు.

 Meet and greet with mahamood ali in london

అలాగే తెలంగాణా ప్రబుత్వం ఎన్నారై ల కోసం ప్రత్యేకమైన ఎన్నారై పాలిసి తీసుకొస్తుందని,

ఏదైన సలహాలు సూచనలు ఉంటే, మంత్రి కే. టి. ఆర్ గారికి తెలుపలాని కోరారు.గత రెండు సంవత్సారాల టి.ఆర్. యస్ ప్రభుత్వ విదానలని, బావిష్యత్తు లో బంగారు తెలంగాణా కై గారి ప్రణాళికలను సభకు క్లుప్తంగా వివరించారు.

యూకే మొట్ట మొదటి సారి అన్ని సంస్థలని ఒక్క పైకి తెచ్చి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై టి.

ఆర్. యస్ ని, ముఖ్యంగా అద్యక్షులు అనిల్ కూర్మాచలంని ప్రత్యేకించిఅభినందించారు. చివరిగా హాజరైన ప్రతి తెలంగాణా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నారై. టి.అర్.యస్ తో మొదలు కొని హైద్రాబాద్ అసోసియేషన్, తెలంగాణా జాగృతి, జె. టి. ఆర్. డి. సి, టెకా, టి. డి. ఆఫ్, టి. ఎన్. ఎఫ్ అద్యక్షులు వారి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని సభకు

వివరించారు.

 Meet and greet with mahamood ali in london

ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం

ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు మహమూద్ అలీ గారికి కృతఙ్ఞతలు తెలిపారు,ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని

తెలిపారు.

చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సబ్యులు ప్రత్యేకంగామహమూద్ అలీ గారిని సన్మానించి, జ్ఞాపిక బహూకరించారు. మహమూద్ అలీ గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.

 Meet and greet with mahamood ali in london

కార్యక్రమంలో ఎన్నారై.టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, సెక్రెటరీ లు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి, శ్రీధర్ రావు, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, మధుసూధన్ రెడ్డి , సృజాన్ రెడ్డి చాడా, మల్లా రెడ్డి , శ్రీకాంత్, సత్య, సత్యం రెడ్డి కంది, చిత్తరన్జన్ రెడ్డి, ఐటీ జాక్ ఛైర్మన్

వెంకట్ రెడ్డి , హైద్రాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు ముజీబ్, ఉపాద్యక్షులు షానవాజ్, ప్రధాన కార్యదర్శి సమి, టి. డి. ఎఫ్ అద్యక్షుడు రామ రావు , జె. టి. ఆర్. డి. సి అధ్యక్షుడు సృజాన్ రెడ్డి, టి. ఈ . ఎన్. ఎఫ్ అద్యక్షులు సిక్క చంద్రశేఖర్, టేకా అద్యక్షుడు శేషేంద్ర, తెలంగాణా జాగృతి అద్యక్షులు సంపత్ మరియు తెలంగాణా జాగృతి జె. టి. ఆర్. డి. సి, టెకా, టి.డి. ఆఫ్, టి. ఎన్. ఎఫ్ ప్రతినిదులు పాల్గొన్నారు.

English summary
Meet and greet with mahamood ali program was held in london. TRS NRI leaders were grandly celebrated the event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X