వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృశ్యమైన ఎన్నారై యువతి మృతి

|
Google Oneindia TeluguNews

Missing Indian-origin teenage girl found dead
లండన్: గత డిసెంబర్‌లో యూనైటెడ్ కింగ్డమ్‌లోని వేల్స్ నగరంలో అదృశ్యమైన భారత సంతతికి చెందిన యువతి మృతి చెందింది. న్యూపోర్ట్‌లోని లింటన్ వీధిలోని తన ఇంటి నుంచి డిసెంబర్ 28న బయటికి వెళ్లిన నీదా నసీర్ (19) తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె సెల్‌ఫోన్ కూడా అప్పట్నుంచి అందుబాటులో లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, గురువారం న్యూపోర్ట్ సమీపంలోని సముద్రం ఒడ్డున నసీర్ మృతదేహాన్ని గుర్తించారు. నసీర్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నసీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే గానీ మృతికి గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు.

తన యూనివర్సిటీకి హాజరుకాలేకపోతున్నందున కొంత అసంతృప్తికి లోనైనా నసీర్, ఇంటి నుంచి వెళ్లిపోయిందని నసీర్ సోదరి షమిలా చెప్పింది. ఆమె మంచి గ్రేడ్స్ సాధిస్తున్నప్పటికీ ఆమెను ఫెయిల్ స్టేటస్‌లో ఉంచడంతో నసీర్ కొంత అసహనానికి గురైందని తెలిపింది.

అంతేగాక, నసీర్ చదువుల కోసం తాము ఖర్చు చేయలేమని నసీర్ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం శవంగా కనిపించింది. ఎన్నిరోజులకైనా నసీర్ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందని భావించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
An Indian-origin teenage girl in Wales missing since December is dead, police have confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X