వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంటీఎఫ్ ఆధ్వర్యంలో మలేషియాలో ఘనంగా ఉగాది వేడుకలు

|
Google Oneindia TeluguNews

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా తెలుగు ఫౌండేషన్.. ఎంటీఎఫ్ ఆధ్వర్యంలో వికారి నామ ఉగాది వేడుకలు నిర్వహించారు. మలేషియాలో ఇండియా హై కమిషనర్ నిషిత్ ఉజ్వల్, సెలంగూర్ స్టేట్ కౌన్సిలర్ గణపతి రావు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

తాల్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలుతాల్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఉగాది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రముఖ గాయకుడు మనో ఆయన బృందంతో చేసిన సంగీత కచేరి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్దం వీడియో ప్రెజెంటేషన్, కొన్ని స్కిట్‌లు వేశారు. అందులో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.

వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

ఎంటీఎఫ్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి, పీకేకేటీఎం అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రావ్, టీఏఎం వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రావు, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, తెలుగు ఇంటలెక్చువల్ సొసైటీ ప్రెసిడెంట్ కొణతల ప్రకాశ్ రావు, ఒకే కుటుంబం ప్రెసిడెంట్ అప్పన్న నాయుడు అతిధులుగా హాజరయ్యారు.

ట్రస్టులకు విరాళం

ట్రస్టులకు విరాళం

ఉగాది వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఎంటీఎఫ్ ప్రెసిడెంట్ కాంతారావు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలను చారిటబుల్ ట్రస్ట్‌లకు అందజేశారు.

మీరు ఎన్నారైలా? మీ సమస్యలు తెలుగువారితో పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు వన్ ఇండియాకు అండగా ఉంటుంది. సమస్యలే కాదు మీ సంబురాలు, సంతోషాలను వన్ ఇండియా పాఠకులతో పంచుకోండి. మీరు పంపే వార్తలు, సలహాలు, సూచనలు [email protected]కు మెయిల్ చేయండి.

English summary
Telugu new year Ugadi celebrated in Malaysia. ceremony held under Malaysian Telugu Foundation . India High Commissioner in Malaysia Nishit Ujawal, Selangor State councellor ganapathi rao attended as chief guests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X