• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాటలతో హోరెత్తిన వేదిక.. కన్నుల పండుగగా నాటా ఐడల్..

|

నాటా మహాసభలంటేనే ఉరుకలెత్తే ఉత్సాహానికి మారుపేరు. ప్రతి ఏటా తమదైన కార్యక్రమాలతో అమెరికాలో తెలుగు గొంతుక వినిపిస్తున్న నాటా మహాసభలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా.. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడు కూడా మే 27 నుంచి 29 వరకు అంగరంగ వైభవంగా నాటా మహాసభలు జరగబోతున్నాయి. అంతకంటే ముందు మహాసభల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఉత్తరమెరికా అంతటా సంగీత సమ్మేళానాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే డల్లాస్ లో జరిగిన నాటా ఐడల్ అక్కడి తెలుగువారిని సంగీత ప్రపంచంలో విహరించేలా చేసింది. అమెరికాలోని మొత్తం 10 నగరాల్లో జరుగుతున్న నాటా ఐడల్ కార్యక్రమం ఏప్రిల్ 29వ తేదీన డల్లాస్ లోని ప్రిస్కో కమ్యూనిటీ వేదికలో జరిగింది. మొత్తం సంగీత సమ్మేళనాల నుంచి 8 మంది గాయనీ గాయకులను ఎంపిక చేసి మే 29న జరిగే ఫైనల్స్ లో వాళ్లకు అవకాశం కల్పించనున్నారు.

 nata idol like a eye feast

డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో ముందుగా.. నాటా ఐడల్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘు కుంచె కు గాయనీ గాయకులు ప్రత్యేక స్వాగతంతో వేదిక లోపలికి ఆహ్వానించారు. నాటా సెక్రటరీ మరియు నాటా ఐడల్ చైర్మన్ గిరీష్ రామిరెడ్డి తో సహా దాదాపుగా మూడు వందల పైగా గాయనీ గాయకులు సంగీత సమ్మేళనంలో పాటలు పాడడానికి పోటి పడ్డారు. నాటా డల్లాస్ కోఆర్డినేటర్ శారదా సింగిరెడ్డి చంద్ర బోస్ ని, రఘు కుంచె ని పరిచయం చేస్తూ వేదిక పైకి ఆహ్వానించారు. తర్వాత నాటా ఐడల్ సభ్యులు ఇద్దరిని పుష్పగుచ్చముతో సత్కరించారు.

డల్లాస్ లో దాదాపుగా అయిదు వందల మంది పాల్గొన్న ఈ మొదటి నాటా ఐడల్ కార్యక్రమం ప్రిస్కో కమ్యూనిటీ వేదికలోని సువిశాల ప్రాంగణంలో ఆనందబరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబోస్, రఘు కుంచె ఇద్దరు కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. "అమెరికాలోని తెలుగు పిల్లలు తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టమైన పనే అయినా.. తెలుగు పాటలు మాత్రం ఒక్క అక్షర దోషం కూడా లేకుండా పాడారు" అని ప్రశంసించారు. టి.వి-5 యాంకర్ పద్మశ్రీ తోట వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ పాటల వేడుకలో 21 మంది చిన్నారులు పెద్దలు పోటీ పడ్డారు. శాస్త్రీయ సంగీత మాధుర్యం, నవ సినీగీతాల సౌరభ్యాల నడుమ వీనులవిందైన సంగీతవిభావరి ప్రేక్షకులను ఎంతో అలరించింది. పోటీదారులు పాడిన ప్రతిపాటను చక్కగా విశ్లేషించారు రచయిత చంద్రబోస్. అలాగే సంగీత గమకాలు, బాణీలో మలుపులు, స్వరాల గమ్మత్తుల గురించి వివరించారు రఘు కుంచె.

మొదటి పోటీలో పాల్గొన్న గాయనీగాయకులందరికీ నాటా అధ్యక్షులు డా.మోహన్ మల్లం గారు మరియు న్యాయనిర్ణేతల చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు.

కన్వెన్షన్ కన్వీనర్ డా. రమణా రెడ్డి గూడూరు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వర్ రెడ్డి గంగసాని. కన్వెన్షన్ కోఆర్దినటర్ రామసూర్య రెడ్డి, బోర్డు ఆఫ్ డైరెక్టర్ డా.రామి రెడ్డి బుచ్చిపూడి, ఎక్స్ క్యూటివ్ కమిటి జయచంద్రా రెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైసర్ ప్రదీప్ సమాల, కన్వెన్షన్ కోకన్వీనర్ డా.శ్రీధర్ రెడ్డి కొరసపాటి, డిప్యూటి కన్వీనర్ ఫల్గుణ్, కోఅర్దినేటర్ సురేష్ మండువ, డిప్యూటి కోఆర్డినేటర్ గీత దమన్న శాలువాతో న్యాయ నిర్ణేతలను ఘనంగా సత్కరించారు. రీజనల్ కోఆర్దినేటర్స్,కల్చరల్ కార్యవర్గ బృందం మాధవి సుంకిరెడ్డి, కమలాకర్ పూనూరు, రేఖ కరణం,శాంత సుసర్ల,ఇంద్రాణి పంచార్పుల,జయ తెలకలపల్లి, రాజేంద్ర పోలు , చంద్రజల సూత్రం, చెన్న కొర్వి, నంద కొర్వి,బాల గణపర్తి, వెంకట్ ములుకుట్ల, సుప్రియ టంగుటూరి,సతీష్ శ్రీరాం,నగేష్ దిన్డుకుర్తి మరియు కళ్యాణి తాడిమేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డా. నాగిరెడ్డి దర్గారెడ్డి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ5, దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, సీవీఆర్ టీవీ, యువ,టోరి, రేడియోమస్తి, చక్కని విందుని సమకూర్చిన హిల్టాప్ యాజమాన్యానికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు.

English summary
nata idol program was celebrated grandly. more than 500 people are attented to the event especially for singing competition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X