• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్, న్యూయార్క్ బతుకమ్మ వేడుకలు

|

న్యూయార్క్: తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్, న్యూయార్కు వారి బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎటు చూసినా పండుగ కోలాహలమే కనిపించింది. అందరి ముఖాలలో ఆనందం, ఉత్సాహం కనిపించాయి.

ఆడవారి చేతిలో బతుకమ్మలు, పట్టు చీరల మిలమిలలు, ఆభరణాల ధగధగలు, పిలలలు పెద్దలు పట్టు లంగాలు, పంచలు, సల్వారు, కమీజుల సంప్రదాయ దుస్తులు ధరించారు.

800 లకు పెగా లాంగ్ ఐలాండ్ తెలుగు వారు రాడిసాన్ హోటల్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TATA)వారు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA), న్యూయార్క్ వారి సహకారంతో నిర్వహించిన బతుకమ్మ దసరా పండగలో సందడి చేయడానికి విచ్చేశారు.

newyork telangana american telugu association batukamma celebrations

TATA సలహాదారుల మండలి చెైర్మన్ శ్రీ పైల్లా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మెగా ఈవెంట్ లో మునపెన్నడూ లేనంతమంది ఆహూతులతో కిక్కిరిసిపోయింది. దాదాపు నలభైకి పైగా చిన్నా పెద్ద బతుకమ్మలు వేదికనలంకరించగా, మహిళలంతా అమ్మవారికి

భక్తి శ్రద్దలతో పూజలు, పారాయణాలు నిరాహ్వించారు.

సింగర్ అదితి తన పాటలతో అలరించగా, యాంకర్ లక్ష్మి తన సహజ వాక్ పటిమతో, హాసూ సంభాషణలతో, కార్యక్రమానికి ఊపు తెచ్చారు. రీజినల్ వైస్ ప్రెసిడెంట్ లు రంజిత్ క్యాతం, సహోదర్ పెద్దిరెడ్డిల నాయకత్వంలో, పురుష మహిళా రీజినల్ కోర్టినేటర్స్, సభ్యులు అత్యంత శ్రమకోర్చి వారాలుగా ప్రణాళికలు రచించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

newyork telangana american telugu association batukamma celebrations

న్యూయార్క్ ప్రముఖ పారిశ్రామికవేత్త డా.పైల్లా మల్లారెడ్డి గారు అందించిన విందు కార్యక్రమం షడ్రుచులతో అతిథులను అలరించింది. అల్పాహారం, లంచ్, సాయంత్రం స్నాక్ టీ లతో బాటు ఐస్ క్రీంలు ఇత్యాది భోజన పదార్థాలు ఆసాంతం అవిరామంగా సమకూరుస్తూనే ఉన్నారు.

కార్యక్రమంలో పూజానంతరం నైవేద్యం, ఆపై నిమజ్జనంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలు, పిల్లల నుంచి పెద్దల దాకా ఫ్యాషన్ షో, టాటా బృందంలోని మహిళల నృత్యం, జడ్జిల ఫ్యాషన్ షోలు అందరిని అలరించాయి. చిన్నారులతో చేయించిన దాండియా నృత్యం అందరి హృదయాలు చూరగొన్నది. అనంతరం వందలాదిగా అతిథులు ఆడా మగా దాండియా ఆటలో మునిగితేలారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య దాత శ్రీ పైల్ల మల్లారెడ్డి గారు కాగా, హాల్ ని సుధాకర్ విడియాల గారు మరియు మాధవ రెడ్డి ఉప్పుగుల్ల గారు సమకూర్చారు. కార్యక్రమానికి విరివిగా ఆర్థిక సహకారం అందించిన ఇతర దాతలు శైలజ కాల్వ, శరత్ వేముగంటి, నాగశ్రీ నల్లా, వేనిగళ్ల సాంబశివరావు, డాక్టర్ శ్రీదేవి భూమి, లక్ష్మి బొడ్డు, శివారెడ్డి, శ్రీనివాస్ గూడూరు, సుజాత తాడెపల్లి, మౌనిక కుంట, రాగిణి రవ్వ, మాధవి సోలెటి, శిరీష శేఖర్ రెడ్డి, సుధా మన్నవ, అనిత గాగెనపల్లి, అరుంధతి అడుప, ఉమా పోలిరెడ్డి, నరసింహ నాయుడు, శ్వేత తాడెపల్లి, శైలజ చల్లపల్లి, రఘురామ్ పన్నాల, పవన రామ జోగ, భాగ్య లక్ష్మి, కృష్ణ తనూజ రాసపుత్ర.

English summary
TATA Grandly conducted the event of Bhatukamma celebrations in Newyork.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X