వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఐటీ నిపుణులకు ఊరట: హెచ్1బీ వీసా ప్రొగ్రాంలో పెద్దగా మార్పుల్లేవు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో కఠినమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌ మేరీ కే ఎల్‌ కార్ల్‌సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్దగా మార్పులేమీ లేవని, అలాగే హెచ్‌-4 వీసాల్లోనూ కొత్త మార్పులేమీ చేయట్లేదని ర్ల్‌సన్‌ వెల్లడించారు.

Recommended Video

వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తే అమెరికాకు నష్టమే
అమెరికా సార్వబౌమ నిర్ణయం

అమెరికా సార్వబౌమ నిర్ణయం

అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉద్యోగ వీసాలు, పని అనుమతులు ఇవ్వడం అమెరికా సార్వభౌమ నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.

ఢిల్లీలో బుధవారం అమెరికా మిషన్‌ ‘స్టూడెంట్‌ వీసా డే' కార్యక్రమాన్ని నిర్వహించింది.

పెద్ద మార్పులేమీ లేవు

పెద్ద మార్పులేమీ లేవు

భారత్‌, అమెరికాల మధ్య ఉన్నత విద్యకు సంబంధించిన సంబంధాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా కార్ల్‌సన్‌ మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పులేమీ లేవని, అలాగే హెచ్‌-4 వీసాలోనూ కొత్త విషయాలేమీ లేవని అన్నారు. హైదరాబాద్, కోలకతా, ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 4వేలమంది విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు కార్ల్‌సన్‌ చెప్పారు.

హెచ్4తో భాగస్వామి

హెచ్4తో భాగస్వామి

2017లో 186,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల్లో చేరారని తెలిపారు. దశాబ్దంతో పోలిస్తే రెండింతలు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగిందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17 శాతం మందితో భారత్ రెండవ స్థానంలో ఉందని కార్ల్‌సన్‌ వెల్లడించారు. కాగా, ట్రంప్‌ యంత్రాంగం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన హెచ్‌-4 వీసా వర్క్‌ పర్మిట్‌ను ఎత్తేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌1-బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్‌-4 వీసాతో పని అనుమతి కల్పిస్తారు.

ఐటీ నిపుణులకు ఊరటే

ఐటీ నిపుణులకు ఊరటే

ప్రస్తుతం హెచ్‌-4 వీసాతో దాదాపు 70వేల మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. హెచ్‌-4 వీసా నిబంధనను ఎత్తేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని గత నెల భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌ వెల్లడించారు. కాగా, ప్రస్తుత కార్ల్‌సన్ భారత ఐటీ నిపుణులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.

English summary
There have been "no big changes" in the H-1B programme and "nothing new" on the H-4 visa policy, the US said on Wednesday, amid the Trump administration's plan to overhaul the immigration system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X