వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెడ్డవాళ్లం కాదు, ఇదీ నా భర్త, అలా చెయ్: భర్తను చంపిన నిందితుడికి కూచిభొట్ల భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో భారతీయ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యాహంకార హత్యకు గురైన విషయం తెలిసిందే. కూచిభొట్ల శ్రీనివాస్ సతీమణి సునయన హతంకుడికి ఉద్వేపూరిత లేఖ రాశారు. తమ అమెరికా ఆశలను చెరిపేశావని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఎప్పుడూ ఇతరులను గౌరవించేవాడని, ఇతరులకు సహాయం చేసే గుణం అని తెలిపారు.

శ్వేతజాతీయులు కానీ వారు అందరూ చెడు చేసేవారు కాదని ఆమె పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధిలో మేం కూడా భాగస్వాములమని చెప్పారు. నువ్వు (ప్యూరింటన్) అనుకున్న దాని కంటే తన భర్త చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. సహృదయులు అన్నారు. బాధ్యత తెలిసిన వ్యక్తి అన్నారు.

మృదువుగా అడిగితే సమాధానం చెప్పేవారు

మృదువుగా అడిగితే సమాధానం చెప్పేవారు

ఇతరుల పట్ల చాలా గౌరవ భావంతో ఉండేవారని సునయన తెలిపారు. తాను, తన భర్త ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టామని, తమ ఆశలను చెల్లా చెదురు చేశావని పేర్కొన్నారు. ప్యూరింటన్ తన కోపాన్ని మనసులో దాచుకొని తన భర్తతో మృదువుగా మాట్లాడి ఉంటే ఆయన అంతకంటే మృదువుగా సమాధానం చెప్పేవారని తెలిపారు.

నిన్ను నీవు తెలుసుకునేందుకు ప్రయత్నించు

నిన్ను నీవు తెలుసుకునేందుకు ప్రయత్నించు

ప్యూరింటన్ తన నేపథ్యం గురించి అడిగితే తన భర్త సంతోషంగా తన గురించి నీకు చెప్పేవారని సునయన అన్నారు. అలాగే శ్వేతజాతీయులు కాని వారంతా చెడ్డవారు కాదని, తామంతా ఈ దేశం (అమెరికా) అభివృద్ధి కోసం పని చేస్తున్నామన్నారు. నీకు ఇప్పుడు దొరికిన సమయాన్ని నిన్ను నీవు తెలుసుకునేందుకు ప్రయత్నించమని చెప్పారు. నీలా అమాయకులను చంపడానికి వచ్చే వారిని అలా చేయడం తప్పు అని, వారి చర్యలను ఆపేలా చూడమని సూచించారు.

 ప్యూరింటన్‌కు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు

ప్యూరింటన్‌కు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు

కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో ఆడమ్ ప్యూరింటన్‌కు అమెరికా ఫెడరల్ కోర్టు వరుసగా మూడు యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించాలని మంగళవారం నాడు తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో కూచిభొట్ల సతీమణి సునయన నేరస్థుడు ప్యూరింటన్‌ను ఉద్దేశించి పై లేఖ రాశారు. ఈ మేరకు తాను రాసిన లేఖను కోర్టులో చదివారు.

కేన్సస్‌లో జరిగిన హత్య

కేన్సస్‌లో జరిగిన హత్య

కాగా, గత ఫిబ్రవరి 22న కేన్సస్‌లోని ఓ బార్‌లో జరిగిన ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. కూచిభొట్ల ఆయనతో పాటు ఉన్న మాదసానిలను కేవలం జాతి విద్వేషంతోనే కాల్చినట్లు మాజీ నౌకాదళ ఉద్యోగి అయిన ప్యూరింటన్ కోర్టులో అంగీకరించాడు.

English summary
The widow of Indian engineer Srinivas Kuchibhotla told the US Navy veteran who killed her husband that he was always respectful to others and would have helped him understand that not every brown skinned person is evil but is contributing to America's growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X