NRI News: అనుమానాస్పద స్థితిలో ఎన్నారై మృతి.. విచారణ చేస్తున్న పోలీసులు..

ఒక నెల క్రితం నగరానికి వచ్చిన యూకేకు చెందిన ఎన్నారై చరణ్జిత్ సింగ్ ఆదివారం రాత్రి జలంధర్ బైపాస్ సమీపంలోని BDA కాలనీలోని తన నాల్గో అంతస్తు ఫ్లాట్ వెలుపల అనుమానాస్పద పరిస్థితులలో మరణించాడు. మూడో అంతస్తులోని ఇరుగుపొరుగు వారితో చరణ్జిత్ సింగ్ చిన్నపాటి వాగ్వాదానికి దిగారు. తర్వాత సింగ్ కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. ఇరుగుపొరుగు వారు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ పరిణామాలకు భయపడి ఇరుగుపొరుగు వారు ఆస్పత్రి నుంచి పారిపోయారు. గొడవ సమయంలో సింగ్‌ను తన నాల్గవ అంతస్తులోని అపార్ట్‌మెంట్ నుంచి నెట్టారని, ఫలితంగా అతనిని ప్రాణం పోయిందని ఆరోపించారు. అయితే ఇవి నిరాధారమైన వదంతులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

 NRI died in suspicious condition in Jalandhar

సింగ్ అతని పొరుగువారి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత అతను నేలపై కుప్పకూలాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ధృవీకరించారు. చరణ్‌జిత్‌ సింగ్‌ హార్ట్‌ పేషెంట్‌ అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. గుండెపోటుతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిర్ధారించగలమని చెప్పారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

సింగ్‌ను నాలుగో అంతస్తు నుంచి తోసివేశారనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. చనిపోయిన వ్యక్తి ఎన్నారై కావడంతో కేసు విచారణను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+