వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆటవెలది పద్యాల్లో భౌతికశాస్త్రం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇండియానా పోలీస్: అమెరికాలోని గ్రేటర్ ఇండియానా పొలిస్ తెలుగు అసోషియేషన్ (గితా) నిర్వహించిన సదస్సుకు ముఖ్య అథితిగా పింగిళి ప్రభుత్వ మహిళా కళశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న డా. మార్క శంకర్ నారాయణ హాజరయ్యారు. తాను చేసిన రచనలకు గుర్తింపుగా ''భౌతికశాస్త్ర కవితాదురీణ'' అవార్దుతో ఘనంగా సత్కరించారు.

ఇండియాన పవర్ ఏజెన్సీ చీఫ్ ఎక్స్కూటివ్ అధికారి రాజెశ్వర్ రావ్, ప్రముఖ డాక్టర్లు మర్రి సత్యనారయణ రెడ్డి, రవీందర్, రేడియోలజిస్ట్ రంగనాయకులు మూర్తి, లక్ష్మి, ఐటీ ఇంజనీర్లు అవినాష్, శ్రీకాంత్, మహేష్, వెంకట్, ఆల్ఫ్రెడ్, గౌరాచారి,సృజన్, మాధవి, రాజెశ్వరి తదితరలు పాల్గొ న్నారు.

తదనంతరం ఇండియానపోలిస్ హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటి అద్యక్షులు చింతల రాజు ఆద్వర్యంలో నిర్వహించిన వేరే కార్యక్రమములో తెలంగాణ ఉద్యమంలో తాను రచించిన తెలంగాణ పోరు శతకం, పాటల్లొ తెలంగాణ లొల్లికి సంబంధించిన పద్యాలను, గేయలను ఆలపించారు. సకల జనుల సమ్మె చూడు-తెలంగాణ లొల్లి చూడు, ఉద్యమ ఉయ్యాలట, కదిలిందీ సకల జనుల సమ్మె,తెచ్చేదిమేమని జెప్పిరి ఇచ్చెద్మెమని జెప్పిరి, ఫలించిన తెలంగాన పొరు అనే గేయాలు ఆకర్షణగా నిలిచాయి.

పద్యాల్లో భౌతిక శాస్త్రం

పద్యాల్లో భౌతిక శాస్త్రం

‘ఆటవెలదిలో బౌతికశాస్త్రం'లోని పద్యాలను, కవితల్లొ ఫిజిక్స్ సామాజిక కవితలను గేయాలను ఆలపించి మార్క శంకరనారాయణ సభికులను ఆకట్టుకున్నారు.

పద్యాల్లో భౌతిక శాస్త్రం

పద్యాల్లో భౌతిక శాస్త్రం

బౌతికరాసులు, ప్రమాణాలు, సదిశలు, అదిశలు, గతిశాస్త్రం, న్యూటన్ గమన నియమాలు, కాంతి, ఊష్ణం, ఎలక్ట్రానిక్స్ పై మార్క శంకరనారాయణ చేసిన రచనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పద్యాల్లో భౌతికశాస్త్రం

పద్యాల్లో భౌతికశాస్త్రం

మువ్వన్నెల జెండా, సైన్స్ విద్యార్థి, విద్యార్థికి నా సందేశం, ప్రపంచీకరణపై మార్క శంకరనారాయణ ఆలపించిన గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పద్యాల్లో భౌతిక శాస్త్రం

పద్యాల్లో భౌతిక శాస్త్రం

గితా చైర్మన్ చింతల రాము కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించారు. ఇండియాన పోలిస్ హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటి అద్యక్షులు చింతల రాజు శంకర్ నారాయణను సభకు పరిచయం చేసారు.

పద్యాల్లో భౌతిక శాస్త్రం

పద్యాల్లో భౌతిక శాస్త్రం

గితా అధ్యక్షుడు మంగారావ్ స్వాగతం పలుకగా, సాహిత్య గితా చైర్, డాక్టర్ డిహెచ్ఆర్ శర్మ అద్యక్షత వహించారు.

పద్యాల్లో భౌతికశాస్త్రం

పద్యాల్లో భౌతికశాస్త్రం

ఇండియానపోలిస్ విశ్వవిద్యాలయ బౌతికశాస్త్ర విభాగ అదిపతి ప్రొఫెసర్ వేమూరి గౌతం మాట్లాడుతూ - బౌతికశాస్త్రాన్ని, పద్యాలరూపంలోను, కవితల రూపంలోను, గేయాల రూపంలోను చెప్పడం చాలా గొప్ప విషయమని, అవి విద్యార్థిల మనస్సులలొకి చొచ్చుకపోతాయని అన్నారు.

పద్యాల్లో భౌతికశాస్త్రం

పద్యాల్లో భౌతికశాస్త్రం

తెలంగాణ పోరుశ తక గ్రంధ ప్రచురణకు పూర్తి ఆర్తిక సహాయం అందజేస్తామని ప్రకటించిన చింతల రాజుకి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Pingali women's college lecturer Marka Shankara anrayana explained physics in Telugu poetic form in Indaia polis of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X