దళిత బంధు పథకం అణగారిన వర్గాల ఆశాజ్యోతి: ఎన్నారైల హర్షం
'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ 'దళిత బంధు' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభం అవుతుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. దళిత బంధు పథకంపై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.
సబ్బండ వర్గాల ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్ మారారని అనిల్ కూర్మాచలం అన్నారు. దళితుల సాధికారత కోసం తీసుకొచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని ఎన్ఆర్ఐలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. గత పాలకులు దళితులని ఓటు బ్యాంక్ లాగా చూశారని చెప్పారు. ఏ రోజు వారి అభివృద్ధి కోసం పని చేయలేదని విమర్శించారు.

కేసీఆర్ మాత్రమే దళితులంతా గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఆనాడు హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేశారు. ఇవాళ 'తెలంగాణ దళిత బంధు' పథకం ప్రారంభానికి కూడా హ్యాజరయ్యే అదృష్టం కలిగిందని అనిల్ కూర్మాచలం సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications