• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లండన్‌లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ వార్షిక సమావేశం

|

లండన్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అధ్యక్షతన లండన్‌లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యూకే వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 5వ వార్షికోత్సవ వేడుకల అనంతరం జరుగుతున్న మొట్టమొదటి సమావేశం కావడంతో రాబోయే సంవత్సరాది కార్యక్రమాల దిశానిర్దేశం ఉంటుందని లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ కడుదుల తెలిపారు.

కార్యక్రమంలో ముందుగా, గత సంవత్సరం సంస్థ చేపట్టిన కార్యక్రమాల వివరాలని ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి సభ్యులకు వివరించారు. తర్వాత వాటిపై చర్చనిర్వహించారు.

ఈ సమావేశంలో సభ్యులంతా చర్చించి కొన్ని తీర్మానాలు-నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

NRI TRS Cell Annual Committee Meeting at London

అందులో..

1. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బృందం ప్రచారంలో పాల్గొనడం.

2. కెసిఆర్ పిలుపు, ఎంపి కవిత ఆదేశాలకనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నారై టిఆర్ఎస్ సెల్ శాఖలకు కృషి.

3. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రపంచ వ్యాప్త శాఖల సహాయంతో కార్యక్రమాలు చేపట్టడం.

4. ఎప్పటిలాగే తెలంగాణా రాష్ట్రంలో సేవ కార్యక్రమాలు, ముఖ్యంగా పేద విద్యార్థుల చదువు కోసం వీలైనంత సహాయం.

5. సంస్థ దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్య అయిన, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రజల్లో ప్రభుత్వంపైన విశ్వాసం పెంచడం.(ఎప్పటిలాగే కెసిఆర్‌కు రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తెలుపడం)

NRI TRS Cell Annual Committee Meeting at London

అంతేగాకుండా, ప్రతి కార్యవర్గ సభ్యుడు వారి స్థాయిలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు కృషి చేయాలని, అలాగే పార్టీ అభివృద్ధికి పని చేయాలని నిర్ణయించారు. ఎన్నారై టిఅర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. మైళ్ళ దూరంలో ఉన్నా.. పార్టీలో బాగస్వాములై తెలంగాణా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మల్సీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బంగారు తెలంగాణా కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

NRI TRS Cell Annual Committee Meeting at London

అడ్వైసరి బోర్డు సభ్యులు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ... ఎలాగైతే చెప్పిన మాట ప్రకారం

తెలంగాణా రాష్ట్రాన్నిసాధించారో.. అలాగే బంగారు తెలంగాణా కూడా కెసిఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. కాబట్టి ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి, హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగరెయ్యాలని కోరారు.

కోర్ కమిటీ సభ్యులు సృజన్ రెడ్డి చాడా మాట్లాడుతూ.. కార్యవర్గ సమావేశానికి హాజరైన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణకై సిఎం కెసిఆర్ చేస్తున్న అబివృద్ది-

సంక్షేమ కార్యక్రమాలు ఎంతో స్పూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలంగాణా బిడ్డా గర్వపడేలా ప్రభుత్వ పాలన ఉందని చెప్పారు.

కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, అడ్వైసరి బోర్డు సభ్యులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి శివాజీ షిండే, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, యూకే- యూరప్ ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి రేకుల, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, ఐటి సెక్రెటరీ శ్రీధర్ రావు తక్కలపల్లి,

కోశాధికారి సెరూ సంజయ్, సంక్షేమ శాఖ ఇంఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, మెంబర్‌షిప్ ఇంఛార్జ్

బండ సతీష్ రెడ్డి, వెస్ట్ లండన్ ఇంఛార్జ్ రాజేష్ వర్మ, కోర్ కమిటీ సభ్యులు సృజన్ రెడ్డి చాడా

తదితరులు పాల్గొన్నారు.

English summary
NRI TRS Cell Annual Committee Meeting held in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X