వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహరేన్ టీఆర్ఎస్ హరితహారం డోర్ పోస్టర్స్: ఆవిష్కరించిన మార్క్‌ఫెడ్ చైర్మన్‌ లోక బాపురెడ్డి

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని లోక బాపురెడ్డి వివరించారు.

|
Google Oneindia TeluguNews

జగిత్యాల: జిల్లాలోని కథలపూర్‌ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత ఆకుపచ్చ హరితహారం రాష్ట్రానికి మణిహారంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిని విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరు భాగస్వాములు కావాలని మార్క్‌ఫెడ్ చైర్మన్‌ లోక బాపురెడ్డి దిశానిర్దేశం చేశారు.

అనంతరం భూషణరావుపేట లోక బాపురెడ్డి నివాసంలో నిర్వహించిన తెరాస మండలస్థాయి హరితహారం సమావేశంలో బాగంగా ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రతిఒక్కరు మొక్కలు నాటలంటు ప్రజలలో అవగాహన పెంచెందుకు మన మండలానికి చెందిన బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సభ్యులు సిరికొండ రాధారపు సతీష్ కుమార్ మరియు ఊట్ పల్లి కి చెందిన బోలిశెట్టి వెంకటేష్ లు ప్రజలలో అవగాహన పెంచెందుకు రూపొందించిన డోర్ స్టికర్ పోస్టర్లను మార్క్‌ఫెడ్ చైర్మన్‌ లోక బాపురెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు ఆవిష్కరించి వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందించి అనందం వక్తం చేశారు.

nri trs cell haritha haram posters released by lokabapu reddy

ఈ సందర్భంగా మన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చక్కటి హరితహారం కార్యక్రమం ద్వారా భావితరాలకు ఎంతో మేలు చేకూరనుందని ప్రతిఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని లోక బాపురెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నాగం భూమయ్య, వర్ధినేని నాగేశ్వర్‌రావు, నాంపెల్లి లింబాద్రి, ఏజీబి మహేందర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

English summary
Markfed Chairman Lokabapu Reddy released posters of Haritha Haram for TRS NRI cell
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X