వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటిఆర్ ప్రతిభ దేశానికే ఆదర్శం, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ విమర్శ: ఎన్నారై టీఆర్ఎస్ యూకె

ఉత్తమ్ కుమార్ రెడ్డి పదజాలం యావత్తు తెలంగాణ యువతను అవమానించినట్లు ఉందన్నారు.

|
Google Oneindia TeluguNews

లండన్: ఇటీవల తెలంగాణ మంత్రి కేటిఆర్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శల మీద ఘాటుగా ఎన్నారై టీఆర్ఎస్ యూకె సభ్యులు ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ యూకె ఆద్వర్యంలో లండన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి కేటిఆర్ గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల ఆనాడు తెలంగాణ ఉద్యమానికి మరియు నేడు తెలంగాణ నిర్మాణానికి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు.

 nri trs cell uk members condemned uttham kumar reddy comments

ప్రజల్లో వారి ఉనికి కాపాడుకోవడం కోసం, రాజకీయ లబ్ది కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లల్లో పట్ట పగలే కోట్ల రూపాయలతో దొరికిన ఒక అవినీతిపరుడు ఉత్తమ్ కుమార్ అని, కనీసం రాజకీయాల్లల్లో ఉండే అర్హత కూడా ఆయనకు లేదని అన్నారు.

నేడు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా తన ప్రతిభతో యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మంత్రి కేటిఆర్ గారిని విమర్శించడం అవివేకానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిల్లర మాటలతో తెలంగాణ నాయకత్వాన్ని అగౌరవ పరిచి, ఏదో నిరుత్సాహపరుస్తామనుకుంటే అది అరణ్య రోదనే అవుతుందని సూచించారు. తెలంగాణ ప్రజలు మీకంటే చైతన్యవంతుల్ని అందుకే నాటి ఉద్యమం నుండి నేటి వరకు తెరాస పార్టీ వైపు ఉన్నారని గుర్తుచేశారు. ఇలాగే విమర్శలు చేస్తూ పోతే.. కనీసం మిమ్మల్ని ఊర్లో అడుగుపెట్టనిచ్చే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు

చేతనైతే, నిజంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి పై చిత్త శుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.
ఎన్నారై టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.

మొత్తం ఇండియా లోనే యూత్ ఐకాన్ గా వున్న కేటీఆర్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని దీనిని ఎన్నారై టి .ఆర్ .యస్ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు . ఈ మూడేళ్ళ కాలంలో అన్నిరంగాలలో తెలంగాణా ఎంతో అభివృద్ధి సాధించించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు .

 nri trs cell uk members condemned uttham kumar reddy comments

తెలంగాణా ప్రభుత్వం మనం కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మించడానికి అహర్నిశలు శ్రమిస్తుందని, తెలంగాణ రాష్ట్రం లో అమలు పరుస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమన్నారు .
ఇకనైనా నిర్మాణాత్మక సలహాలు ,సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలనీ లేదనే చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని తెలిపారు.

ఎన్నారై తెరాస అధికార ప్రతినిధి, సెక్రటరీ శ్రీ చాడ సృజన్ రెడ్డి మాట్లాడుతూ TPCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటిఆర్ గారిని బచ్చా అని సంబోదించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రాజకీయ అహంకారానికి నిదర్శనం అన్నారు. కేటిఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే వయసులో చిన్న వారే కానీ రాజకీయ పరిపక్వతలో, తెలంగాణాని అభివృద్ధి పదంలో నడిపివ్వడంలో, విదేశీ పెట్టుబడులు తీసుకరావడంలో కేటిఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే ఎన్నో రేట్లు పెద్ద వారీగా, అనుభవం ఉన్న వారీగా పని చేస్తున్నారు అని గుర్తు చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలం యావత్తు యువ యువకులను అవమానించినట్టు ఉన్నదని కావున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యువ నాయకులకు అందరికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రాకు మూడవ పంట కోసం నిర్దాక్షిణ్యంగా 14000 ఎకరాలను నీట ముంచిన పులిచింతల ప్రాజెక్ట్ ని పొగడడం అంటే ఆయనకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్ధం అవుతుంది అని ప్రజలకు గుర్తు చేసారు.

కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమతో కాదని అందుకే తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దొంగ ప్రేమను అర్ధం చేసుకొని ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టాలనని, కాంగ్రెస్ భూస్థాపితం అయిన నాడే తెలంగాణా అభివృద్ధికి ఆటంకాలు తొలగుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ని పాతాళం కంటే పది కిలోమీటర్ల లోపల పాతి పెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

English summary
NRI Trs cell UK Members condemned Congress President Uttham Kumar Reddy comments on KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X