వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో (ఏటీఫ్) ఆధ్వర్యంలో భారత 69వ గణతంత్ర వేడుకలను రీడాల్మేర్ - యూప్ జాన్ పార్క్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది ప్రవాస భారతీయులు సిడ్నీలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఏలేటి మరియు ప్రెసిడెంట్ అశోక్ మాలిష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.

NRIs celebrate Republic day in Ausralia

ఈ సందర్భంగా జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలకు హాజరైన ఎన్నారైలందరికీ భారతీయ మిఠాయిలను పంచిపెట్టారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి మాట్లాడుతూ.. ఏటీఫ్ స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలను వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను గురించి ప్రదీప్ తెడ్ల ,రామ్ గుమ్మడివాలి తెలిపారు.

ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, వల్లభ్‌భాయి పటేల్ లాంటి మహానీయులను గుర్తు చేసుకోవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఈ 69 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని గణతంత్ర వేడుకల కు హాజరైన ఎన్నారైలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రదీప్ సేరి చెప్పారు.

ఈ సందర్భంగా జాతీయోద్యమం, ఆటలు, సినిమా, వివిధ రంగాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవెర్దన్ సుమేషు రెడ్డి , వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, కవిత, సంగీత, రూప , సందీప్ మునగాల, అనిల్ మునగాల ప్రశాంత్ కడపర్తి, మిథున్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Republic day celebrations held in Australia by NRIs in a big way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X