• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

14 ఏళ్లుగా సౌదీలో.. స్వదేశానికి తిరిగొస్తూ.. విమానంలోనే...

By Ramesh Babu
|

రియాద్: కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ఎడారి దేశానికెళ్లి.. అక్కడ 14 ఏళ్లపాటు పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో సొంతూరికి వస్తూ.. చివరికి విమాన ప్రయాణంలోనే కన్నుమూశాడు.

దారుణం: అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

ఇదో భారతీయుడి విషాధగాథ. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ సలీమ్ (35) పధ్నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడ రియాద్ లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ తనతోపాటు తన సోదరుడిని కూడా సౌదీకి తీసుకెళ్లాడు.

Passenger on Saudi-India flight dies in Abu Dhabi

అయితే కొన్ని నెలలక్రితం మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇక్కడ లాభం లేదనీ, భారత్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటే తగ్గుతుందని సౌదీ డాక్టర్లు వెల్లడించారు.

చెల్లెలి వివాహం కూడా దగ్గరపడటం, కొత్తగా నిర్మించిన ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమం కూడా ఉండటంతో.. అన్నింటికీ ఒకేసారి వెళ్లినట్లు ఉంటుందని భావించిన సలీమ్.. ఆరు నెలల సెలవు పెట్టి భారత్‌కు ప్రయాణమయ్యాడు.

బుధవారం సౌదీలోని రియాద్ నుంచి భారత్‌లోని కోజికోడ్‌కు వెళ్లే ఎయిరిండియా విమానం ఎక్కాడు. అయితే ఊహించని రీతిలో మధ్యాహ్నం 3.51 నిమిషాల సమయంలో అతడికి విమానంలోనే గుండెపోటు వచ్చింది.

తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, డాక్టర్ సాయం అవసరమని సలీమ్ విమాన సిబ్బందికి తెలిపాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా యూఏఈలోని అబూదాబిలో దించారు. వెంటనే విమానంలోని వైద్య సిబ్బంది... సలీమ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే అతడు ప్రాణాలు వదిలాడు.

మహమ్మద్ మరణించినట్లు అబూదాబీ డాక్టర్ల నుంచి మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు విమాన ప్రయాణాన్ని మరికొద్ది సేపు నిలిపివేశారు. అతడి మృతదేహాన్ని అక్కడి భారతీయ ఎంబసీ సంరక్షణలో ఉంచి.. 5.48 గంటల సమయంలో మళ్లీ విమానం బయలుదేరింది.

మరోవైపు మహమ్మద్ మరణ వార్తను విని సౌదీలోనే ఉండే అతడి సోదరుడు షాక్‌కు గురయ్యాడు. అతడితోపాటు ఉండే అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి.. డాక్టర్లతోనూ, స్వదేశంలోని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వెంటనే దుబాయికి వచ్చి.. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తామని అతడు వెల్లడించాడు.

మృతుడు మహ్మద్ సలీమ్ కు భార్య, మూడేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతూరికి వెళ్లి ఆరు నెలలపాటు హ్యాపీగా ఉందామని బయలుదేరిన మహమ్మద్‌కు ఇలా జరగడం బాధాకరమని విమానంలోని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
A passenger flying home to India from Saudi Arabia died in an Abu Dhabi hospital on Wednesday. The plane made an emergency landing in the UAE capital after he complained of discomfort. Air India Express flight IX-322 from Riyadh to Calicut landed at Abu Dhabi airport at 3.51pm after the passenger, Mohammad Saleem, 35, complained of discomfort, Ranjan Datta, manager of Air India, Abu Dhabi and Al Ain, told Gulf News. Saleem, a native of Malappuram in Kerala, died in an Abu Dhabi hospital. The medical team at the airport responded quickly to the emergency and the patient was rushed to Mafraq Hospital where he was pronounced dead, the official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X