వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌత్‌ కరోలినా గవర్నర్‌ హాలెకు ఎన్నారైల అభినందనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కొలంబియా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సౌత్ కరోలినా గవర్నర్‌గా తిరిగి ఎన్నికైన భారత సంతతికి చెందిన నిక్కీ రాంధవా హాలె గత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో గెలిచిన హాలే.. సౌత్ కరోలినా 116వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ హాలేనే కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఉన్న గవర్నర్లలో ఆమె చిన్న వయస్కురాలు కావడం గమనార్హం.

భారత సంతతికి చెందిన హాలే తిరిగి గవర్నర్‌గా ఎన్నిక కావడం పట్ల ప్రవాసభారతీయులు హర్షం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలం నుంచి ఆమెకు మద్దతిస్తూ వస్తున్న ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సి) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై ఆమెకు అభినందనలు తెలిపారు. ఆయనతోపాటు మరో 15మంది డెలిగేషన్స్ కూడా హాజరయ్యారు.

ఐఏఎఫ్‌సి బోర్డ్ డైరెక్టర్లు, మద్దతుదారులు మురళీ వెన్నం, రాంకీ చెబ్రోలు, అరుణ్ అగర్వాల్, అన్య అగర్వాల్, సురేష్ వులువల, గ్రేస్ సురేష్, డా. రాజేష్ అడుసుమిల్లి, విజయ్ కృష్ణ పిల్ల, సంజయ్ ఆనంద్, అవితా ఆనంద్, అనీశ్ ఆనంద్, అమితాబ్ ఘోష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ హాలే.. తనకు మద్దతుగా నిలిచినందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డల్లాస్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం రోజున విందు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమె తమ కుటుంబసభ్యులను పరిచయం చేశారు.

డల్లాస్‌లో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించాలని ఈ సందర్భంగా హాలేను ప్రసాద్ తోటకూర కోరారు. ఐఏఎఫ్‌సిసి, ఐఏఎన్‌టిలకు నేతృత్వం వహించి ఈ నిర్మాణాన్ని చేపట్టిన ప్రసాద్ తోటకూరను హాలే అభినందించారు. తనకు అహింసా, శాంతి సందేశాలను ప్రబోధించిన మహాత్మాగాంధీ అంటే ఎంతో గౌరవమని చెప్పారు.

ఎన్నారైల అభినందనలు

ఎన్నారైల అభినందనలు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సౌత్ కరోలినా గవర్నర్‌గా తిరిగి ఎన్నికైన భారత సంతతికి చెందిన నిక్కీ రాంధవా హాలె గత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్నారైల అభినందనలు

ఎన్నారైల అభినందనలు

భారీ మెజార్టీతో గెలిచిన హాలే.. సౌత్ కరోలినా 116వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ హాలేనే కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఉన్న గవర్నర్లలో ఆమె చిన్న వయస్కురాలు కావడం గమనార్హం.

హాలేతో ప్రసాద్ తోటకూర

హాలేతో ప్రసాద్ తోటకూర

భారత సంతతికి చెందిన హాలే తిరిగి గవర్నర్‌గా ఎన్నిక కావడం పట్ల ప్రవాసభారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

అభినందనలు

అభినందనలు

గత దశాబ్ద కాలం నుంచి ఆమెకు మద్దతిస్తూ వస్తున్న ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సి) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై ఆమెకు అభినందనలు తెలిపారు. ఆయనతోపాటు మరో 15మంది డెలిగేషన్స్ కూడా హాజరయ్యారు.

అభినందనలు

అభినందనలు

ఐఏఎఫ్‌సి బోర్డ్ డైరెక్టర్లు, మద్దతుదారులు మురళీ వెన్నం, రాంకీ చెబ్రోలు, అరుణ్ అగర్వాల్, అన్య అగర్వాల్, సురేష్ వులువల, గ్రేస్ సురేష్, డా. రాజేష్ అడుసుమిల్లి, విజయ్ కృష్ణ పిల్ల, సంజయ్ ఆనంద్, అవితా ఆనంద్, అనీశ్ ఆనంద్, అమితాబ్ ఘోష్ తదితరులు హాజరయ్యారు.

అభినందనలు

అభినందనలు

ఈ సందర్భంగా గవర్నర్ హాలే.. తనకు మద్దతుగా నిలిచినందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డల్లాస్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

అభినందనలు

అభినందనలు

గురువారం రోజున విందు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమె తమ కుటుంబసభ్యులను పరిచయం చేశారు.

ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన ఆమె.. తన పర్యటన విజయవంతంగా ముగిసిందని చెప్పారు. తనకు అక్కడి ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయని తెలిపారు. సౌత్ కరోలినా, ఇండియా సంబంధాలను మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు.

కాగా, హాలే హయాంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. 2016లో జరగనున్న ఎన్నికల్లో ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయి. ఆమె భర్త మైకేల్ ఆర్మీ నేషనల్ గార్డులో కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హాలే-మైకేల్ దంపతులకు ఇద్దరు రేనా(16), నళిన్(13) పిల్లలున్నారు.

English summary
Proud daughter of Indian immigrants, Nikki Randhawa Haley who was re-elected as Governor of South Carolina in recent elections sworn in as the 116th Governor of South Carolina on Wednesday, January 14th 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X