వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారి శాన్వి హత్య కేసు: రఘనందన్‌కు మరణశిక్ష

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

 Raghunandan Yandamuri sentenced to death in Upper Merion murders
న్యూఢిల్లీ: అమెరికాలో సంచలనం రేపిన చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిలను హతమార్చిన యండమూరి రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రెండేళ్ల పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు ఈ నెల తొమ్మిదిన రఘనందన్‌ దోషిగా నిర్దారించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారి కిడ్నాప్, జంట హత్యలు చేసిన రఘనందన్‌కు కోర్టు మరణశిక్ష విధించింది.

2012, అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో జరిగిన ఈ దారుణంలో చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిలు వారి సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. రఘునందన్, ఆ తర్వాత మాట మార్చాడు. కేవలం దొంగతనం మాత్రమే చేశానని, హత్యలతో తనకు సంబంధం లేదని కోర్టుకు చెప్పాడు.

ఇద్దరు అమెరికన్ పౌరులు తనను బెదిరించి, శాన్వీ, సత్యవతిలను హత్య చేశారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మారింది. కేవలం డబ్బు కోసమే రఘునందన్ జంట హత్యలకు పాల్పడ్డాడని ఈ నెల 9న కోర్టు నిర్థారించింది. కేసులో దోషిగా తేలిన రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

English summary
After deliberating four hours, a jury Tuesday handed down two death sentences in the case of Raghunandan Yandamuri, who was convicted last week of murder in the killings of Satyavathi Venna and her 10-month-old granddaughter, Saanvi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X