వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాక్రమెంటో తెలుగు సంఘం 15వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాల సందర్భంగా "మనం" సంస్థ సహకారంతో రూపుదిద్దిన "రంగస్థలం" నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లులు, సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరంలోని ఫాల్సం హైస్కూల్ ధియేటర్లో శనివారం జనవరి 19వ తేది 2019 మధ్యాహ్నం 12గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలలో ప్రదర్శించినవి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలలో ప్రదర్శించినవి.

1. మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన "రంగస్థలం" నాటకం
2. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనంలో గోపాలుడు, అన్నమాచార్య గీతామాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు.
3. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు.
4. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

తరలి వచ్చిన తెలుగు కుటుంబాలు

తరలి వచ్చిన తెలుగు కుటుంబాలు

సంక్రాంతి వేడుకల సందర్భంగా టాగ్స్ అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక డేవిస్ నగరంలో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్‌వారు వండిన నోరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరెన్నోవిశేషాలతో ఆహూతులను అలరించాయి. కదలిరండి, కలసిరండి, సంక్రాంతి సంబరాలని ఉమ్మడిగా జరుపుకొందామని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా తరలి వచ్చాయి.

ఘన సన్మానం

ఘన సన్మానం

ఈ సందర్భంగా గృహహింసకు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియాలో ఉన్న స్థానిక "మై సిస్టర్స్" స్వచ్చంద సంస్థ అధికారి "సిత్రా త్యాగరాజయ్య", 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత "శ్రీ వంశీ మోహన్ మాగంటి", సిలికానాంధ్ర యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిథులుగా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియు శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదికపై ఆహ్వానించి ఘనంగా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు.

సంజీవిని ఆసుపత్రి

సంజీవిని ఆసుపత్రి

ఈ సందర్భంగా "శ్రీ వంశీ మోహన్ మాగంటి మాట్లాడుతూ.. మనదైన తెలుగు కథ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు అందజేయాలన్నారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ... కూచిపూడి గ్రామంలో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి "సంజీవిని" రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగువారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో "సంజీవిని" ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో "సంజీవిని" ఆసుపత్రిని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్రను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు.

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల, ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ, సమాచార అధికారి రాఘవ చివుకుల నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది.

శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు

శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు

ఈ సందర్భంగా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు "విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి" లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక "వీఎంబ్రేస్"స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శనకు ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతిసేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు. టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారం జనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన అందరూ ఆశీర్వదించారు.

విరాళాలు ఇవ్వదలిచిన వారు

విరాళాలు ఇవ్వదలిచిన వారు

కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతంకు అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్‌లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు "వీఎంబ్రేస్" స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకంగా విరాళాలు అందజేస్తుందని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు. సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చునని వారు తెలిపారు. టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలనుతెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org, https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహకసభ్యులు కోరారు.

English summary
Sacramento Telugu Sangam sankranthi sambaralu and 15th anniversary in california state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X