వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్: మంగళంపల్లికి ఎన్నారైల ఘన నివాళి

|
Google Oneindia TeluguNews

టెక్సాస్: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు అమెరికాలోని ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) చెన్నైలోని తన నివాసంలో మంగళవారం నిద్రలోనే కన్నుమూశారు.

కాగా, ఇర్వింగ్ పట్టణంలోని అమరావతి ఇండియన్ రెస్టారెంట్‌లో డల్లాస్‌కు తెలుగు ప్రవాసులందరూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తానాకు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయం(2008)లో బాలమురళీకృష్ణతో సాన్నిహిత్యం ఏర్పడిందని, అనాటి మధురానుభూతులను ఈ సందర్భంగా పంచుకున్నారు డాక్టర్ ప్రసాద్ తోటకూర.

 Shraddhanjali to Dr. Mangalampalli Balamuralikrishna in Dallas

టాంటెక్స్ అధ్యక్షుడు సుబ్రమణ్యం జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సంగీత ప్రపంచానికి బాలమురళీకృష్ణ మరణం తీరని లోటని అన్నారు. ఇక్కడి తెలుగువారికి ఆయన సుపరిచుతులని చెప్పారు. 1990లోన్యూజెర్సీలో కాన్సర్ట్ ఇచ్చిన నాటి నుంచి ఆయన తనకు తెలుసని రావు కల్వల తెలిపారు. ఆయన ఎంతో మృధుస్వభావి అని గుర్తుచేసుకున్నారు.

 Shraddhanjali to Dr. Mangalampalli Balamuralikrishna in Dallas

చంద్రహాస్ మద్దుకూరి మాట్లాడుతూ.. బాలమురళీకృష్ణ సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. విజయవాడలో తనకు బాలమురళీకృష్ణ చిన్ననాటి నుంచి తెలుసని మీనాక్షి అనిపిండి తెలిపారు. తాను కూడా కర్ణాటిక్ గాయని కావడంతో ఆయనను తరచూ కలుస్తుండేవారమని గుర్తు చేసుకున్నారు.

 Shraddhanjali to Dr. Mangalampalli Balamuralikrishna in Dallas

శ్యామల రుమల మాట్లాడుతూ.. చెన్నైలో తాను బాలమురళీకృష్ణ సంగీత కచేరీలకు వెళ్లేవారమని, ఆయన సంగీత కచేరీలో ఎంతో మధురానుభూతినిచ్చేవని తెలిపారు. కాగా, శాంత, విశ్వానాథమ్ పులిగండ్ల కుటుంబం డల్లాస్‌కు వచ్చిన ప్రతిసారి బాలమురళీకృష్ణకు ఆతిథ్యం ఇచ్చేవారు.
ఈ సందర్భంగా వారు బాలమురళీకృష్ణతో తమకు గల అనుభవాన్ని వివరించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Dallas Telugu Community gathered at Amaravathi Indian Restaurant in Irving, Texas on November 22, 2016 to pay a rich tribute to the legend Carnatic Musician Padma Vibhushan Dr. Mangalampalli Balamuralikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X