వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా 'క్రీడా దినోత్సవం', 'సుఖీభవ'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టెక్సాస్: తెలుగు వారి మధ్య సుహృద్భావం , ఆరోగ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) క్రీడా దినోత్సవం డాల్లస్-ఫోర్ట్ వర్త్ లోని కొపెల్ నగరములోగల ఆండ్రు బ్రౌన్ పార్కులో క్రీడా పోటీల విభాగం సమన్వయ కర్త వెంకట్ దండ మరియు వారి జట్టు పర్యవేక్షణలో సుమారు 250 మంది క్రీడాకారులు మరియు టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ క్రీడల ప్రారంభోత్సవంలో సరికొత్త క్రీడల బ్యానర్‌ను ఆవిష్కరించారు. వినూత్నముగా ఈ సారి క్రీడా పతాకమును రూపొందించి, అందరి సమక్షములో, అనందోత్సాహల నడుమ, టాంటెక్స్ అధ్యక్షుడు విజయ్ మోహన్ కాకర్ల మరియు ఉత్తరాధ్యక్షులు ఊరిమిండి నరసింహారెడ్డి ఔత్సాహికుల మధ్య ఆవిష్కరిస్తూ ఇందులో భాగంగా నిర్వహించిన 5K రన్ ను ప్రారంభించారు.

విజయ్ మోహన్ మాట్లాడుతూ ఈ పొటీలు తెలుగు వారి స్నేహానికి, సుహృద్భావానికి, మరియు ఐకమత్యానికి ప్రతీక అన్నారు. పొటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజములో భాగస్వామ్యం కావడము గొప్ప విషయమని, మన తెలుగు వారిని ఇంకా ఎంతో ప్రోత్సహించాలని కోరారు. ముఖ్యంగా జాతీయ సంస్థలను ఒకే వేదిక మీద కలవడము మహా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఈ సందర్భముగా పిల్లలకు గోనె సంచి దూకుడు పోటీలు, మహిళలకు నిమ్మకాయ-చెంచా పరుగు పందాలు, పురుషులకు మూడు కాళ్ళ పరుగు పొటీలు నిర్వహించారు. పూర్వాధ్యక్షుల గౌరవార్దం నిర్వహించిన టగ్-ఆఫ్-వార్ పొటీ అందరిని ఎంతో అలరించినది. ఈ పోటీలలో చిన్నారులు, యువత, మహిళలు ఎక్కువ మంది పాల్గొనడము ఎంతో చక్కని వాతావరణాన్ని కలుగచేసింది.

5K బాలికల విభాగములో యుక్త ఇనేని, గురిష కౌర్, కేతన ఉప్పలపాటి; బాలుర విభాగములో జయదీప్ గొల్ల, సుహాస్ కుర్కురి, ప్రీతం కొండెపాటి; మహిళల విభాగములో కవిత కట్ట, రితి, రచన కౌత; పురుషుల విభాగములో మురళీ కొండెపాటి, బోని చింతం, సాయి తిరునగరి లు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచారు.

గోనె సంచి పొటీలో బాలికల విభాగములో యుక్త ఇనేని, సాహితి అరిమంద, లలిమ కర్రి; బాలుర విభాగములో సుహాస్ కుర్కురి, అకిల్ దొండపాటి, జసిత్ వనం, సుచిత్ ఇనేని లు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచారు. మహిళల నిమ్మకాయ-చెంచా పరుగులో పద్మ ప్రియ ఆరాద్యుల, కవిత కట్ట, రాధిక రెడ్డి లు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచారు.

పురుషుల మూడు కాళ్ళ పరుగులో జషిత్ వనం, సుహాస్ కుర్కురి, శ్రీని కర్లపుడి, బోని చింతం, సుచిత్ ఇనేని, రుత్విక్ అనంతుల ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచారు. విజేతలందరికి పోషక దాతలు, కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా బహుమతి ప్రదానము చేసారు.

టాంటెక్స్ క్రీడా దినోత్సవం -2014 కు టి షర్ట్స్ మరియు అల్పాహారం పంచి పెట్టడానికి ముందుకు వచ్చిన పోషక దాతలు యునైటెడ్ ఇట్ సోలుషన్స్ (అజయ్ గౌడ , చందు కాజ ) మరియు కిషొర్ చుక్కల, అవర్ ప్లేస్ రెస్టారెంట్లు ( బాబు) కు సంస్థ తరపున ప్రత్యక ధన్యవాదాలు తెలపటం జరిగినది.

టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, మహేష్ ఆదిభట్ల, బాల్కి చామకూర, జ్యొతి వనం మరియు క్రీడల కమిటి సభ్యులు బాలాజీ మేరెడ్డి, మురలి కొండెపాటి, రామక్రిష్ణారెడ్డి రొడ్డ, అరవింద్ ఇంజా, శ్రీధర్ బెండపూడి, రాజు కుర్కురి, , రాజేంద్ర మాదాల, లక్ష్మి పాలేటి మరియు కిషొర్ చుక్కల నిర్దిష్టమైన ప్రణాళికతో ఆటల పోటీలు సక్రమంగా జరగడానికి ఎంతో కృషి చేశారు. టాంటెక్స్ క్రీడల ప్రతినిధి వెంకట్ దండ న్యాయనిర్ణేతలకు, స్వచ్చంద కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సుఖీభవ

రాగాలా- సరాగాల, హాసాల-విలాసాల సాగే సంసారం, సుఖ జీవన సారం అనే ఆ పాత మధురమైన సినిమా పాట వింటే నేటికి కూడా ఎంతో హాయి కలుగుతుంది. ఈ ప్రపంచంలో భర్త కు భార్యను మించిన సంపద, అలాగే భార్యకు భర్తను మించిన దైవము కానరావు అనే ఇతి వృత్తం తో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు ఎంతో ఘనంగా డాల్లస్-ఫోర్ట్ వర్త్ లో, రుచి రెస్టారెంటు లో నిర్వహించిన "సుఖీభవ"అనే కార్యక్రమం, భార్యాభర్తల మనస్సులో మమతల పందిళ్ళు వేసి , మల్లె పూల వాన కురిపించింది.

సుఖీభవ సమన్వయకర్త జ్యోతివనం కార్యక్రమం ప్రారంభిస్తూ, "మనలో చాలామంది పని ఒత్తిడి వల్ల, లేదా పిల్లల వ్యవహారాల వలన యాంత్రిక జీవనానికి అలవాటుపడి, మన గురించి మనం ఆలోచించుకోవటానికి తగినంత సమయం కేటాయించలేక పోతున్నాము. అందువలన ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తే పరిపూర్ణ ఆరోగ్యంతో కేవలం శారీరకంగానే కాకుండా, సామాజికంగా, మానసికంగా, వృత్తిపరంగా, అన్ని రకాలుగా హాయిగా జీవితంలోని ఆనంద మకరందాలను ఆస్వాదించగలుగుతాం, పదిమందికీ అందించగలుగుతాం.

ప్రతి రోజూ మనందరం కాలంతో పాటు పరిగెడుతున్నాం , భార్యాభర్తలకు సరిగ్గా కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం కూడా దొరకడం లేదు , ఉమ్మడి కుటుంబాలు , చిన్న కుటుంబాలు గా మారాయి , ఇటు వంటి పరిస్థితులలో , మా ఈ కార్యక్రమం ద్వారా , ఆలు మగలు మధ్య అనురాగాన్ని మరింత పెంపొందించి, ఏమైనా చిన్న లోటు పాట్లు ఉంటే , అంతా కలిసి ఒక కుటుంబం గా వాటిని అధిగమించి , ఆత్మీయత , అనుభందాల పందిరిలో నిండు నూరేళ్లు చక్కగా కాపురం చేయాలని అందుకే మేము ‘ సుఖీభవ' కార్యక్రమం చేస్తున్నా"మని తెలియ చేసారు.

ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరమైన ఆటలతో , సరదా పాటలతో ఎంతో ఉల్లాసంగా తీర్చిదిద్దారు. అందులో ప్రధానంగా వచ్చిన ఆహుతులను విభాగాలు గా చేసి "పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు " రాయమన్నారు. ఎక్కవగా ప్రేమ, అనురాగం , ఒకరికి మరొకరి పైన నమ్మకం , స్నేహ భావం, హాస్య చతురత లు అందరూ రాయడం విశేషం.

కొంత మంది మగ వారు జగడం కూడా అవసరమే అప్పుడే ప్రేమ మరింత పెరుగు తుంది అని సరదా వాదన కూడా చేయబోయి, శ్రీ మతుల చిరు కోపపు చూపులతోనే ఆగి పోవడం సన్నివేశం పై మరిన్ని హాస్యపు జల్లులు కురిపించింది.

 ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ


తెలుగు వారి మధ్య సుహృద్భావం , ఆరోగ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) క్రీడా దినోత్సవం డాల్లస్-ఫోర్ట్ వర్త్ లోని కొపెల్ నగరములోగల ఆండ్రు బ్రౌన్ పార్కులో క్రీడా పోటీల విభాగం సమన్వయ కర్త వెంకట్ దండ మరియు వారి జట్టు పర్యవేక్షణలో సుమారు 250 మంది క్రీడాకారులు మరియు టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ


ఈ క్రీడల ప్రారంభోత్సవంలో సరికొత్త క్రీడల బ్యానర్‌ను ఆవిష్కరించారు. వినూత్నముగా ఈ సారి క్రీడా పతాకమును రూపొందించి, అందరి సమక్షములో, అనందోత్సాహల నడుమ, టాంటెక్స్ అధ్యక్షుడు విజయ్ మోహన్ కాకర్ల మరియు ఉత్తరాధ్యక్షులు ఊరిమిండి నరసింహారెడ్డి ఔత్సాహికుల మధ్య ఆవిష్కరిస్తూ ఇందులో భాగంగా నిర్వహించిన 5K రన్ ను ప్రారంభించారు.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

విజయ్ మోహన్ మాట్లాడుతూ ఈ పొటీలు తెలుగు వారి స్నేహానికి, సుహృద్భావానికి, మరియు ఐకమత్యానికి ప్రతీక అన్నారు. పొటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజములో భాగస్వామ్యం కావడము గొప్ప విషయమని, మన తెలుగు వారిని ఇంకా ఎంతో ప్రోత్సహించాలని కోరారు. ముఖ్యంగా జాతీయ సంస్థలను ఒకే వేదిక మీద కలవడము మహా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఈ సందర్భముగా పిల్లలకు గోనె సంచి దూకుడు పోటీలు, మహిళలకు నిమ్మకాయ-చెంచా పరుగు పందాలు, పురుషులకు మూడు కాళ్ళ పరుగు పొటీలు నిర్వహించారు. పూర్వాధ్యక్షుల గౌరవార్దం నిర్వహించిన టగ్-ఆఫ్-వార్ పొటీ అందరిని ఎంతో అలరించినది. ఈ పోటీలలో చిన్నారులు, యువత, మహిళలు ఎక్కువ మంది పాల్గొనడము ఎంతో చక్కని వాతావరణాన్ని కలుగచేసింది.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ


5K బాలికల విభాగములో యుక్త ఇనేని, గురిష కౌర్, కేతన ఉప్పలపాటి; బాలుర విభాగములో జయదీప్ గొల్ల, సుహాస్ కుర్కురి, ప్రీతం కొండెపాటి; మహిళల విభాగములో కవిత కట్ట, రితి, రచన కౌత; పురుషుల విభాగములో మురళీ కొండెపాటి, బోని చింతం, సాయి తిరునగరి లు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచారు.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

రాగాలా- సరాగాల, హాసాల-విలాసాల సాగే సంసారం, సుఖ జీవన సారం అనే ఆ పాతమధురమైన సినిమా పాట వింటే నేటికి కూడా ఎంతో హాయి కలుగుతుంది. ఈ ప్రపంచంలో భర్త కు భార్యను మించిన సంపద, అలాగే భార్యకు భర్తను మించిన దైవము కానరావు అనే ఇతి వృత్తం తో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు ఎంతో ఘనంగా డాల్లస్-ఫోర్ట్ వర్త్ లో, రుచి రెస్టారెంటు లో నిర్వహించిన "సుఖీభవ"అనే కార్యక్రమం, భార్యాభర్తల మనస్సులో మమతల పందిళ్ళు వేసి ,మల్లె పూల వాన కురిపించింది.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

సుఖీభవ సమన్వయకర్త జ్యోతివనం కార్యక్రమం ప్రారంభిస్తూ, "మనలోచాలామందిపనిఒత్తిడివల్ల,లేదాపిల్లలవ్యవహారాలవలనయాంత్రికజీవనానికిఅలవాటుపడి,మన గురించిమనంఆలోచించుకోవటానికితగినంతసమయంకేటాయించలేకపోతున్నాము.

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరమైన ఆటలతో , సరదా పాటలతో ఎంతో ఉల్లాసంగా తీర్చిదిద్దారు. అందులో ప్రధానంగా వచ్చిన ఆహుతులను విభాగాలు గా చేసి"పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు " రాయమన్నారు. ఎక్కవగా ప్రేమ, అనురాగం , ఒకరికి మరొకరి పైన నమ్మకం , స్నేహ భావం, హాస్య చతురత లు అందరూ రాయడం విశేషం.
 ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ


కొంత మంది మగ వారుజగడం కూడా అవసరమే అప్పుడే ప్రేమ మరింత పెరుగు తుంది అని సరదా వాదన కూడా చేయబోయి, శ్రీ మతుల చిరు కోపపు చూపులతోనేఆగి పోవడం సన్నివేశం పై మరిన్నిహాస్యపు జల్లులు కురిపించింది.

 ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఘనంగా క్రీడా దినోత్సవం, సుఖీభవ

ఇందులో మూడు తరాల జంటలను ఒకే వేదిక పైన కూర్చోబెట్టి , వారికి ఒకే రకమైన ప్రశ్నలు అడిగి , వాటికి వాళ్ళు ఎలా సమాధానం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. కార్యక్రమం చివరలో "నీ మనసు నాకు తెలుసు" అనేకార్యక్రమం ఎన్నో నవ్వుల పువ్వులు పూయించింది.

తరువాత మరొక హాస్య భరిత మైన ఆట "జగదేక వీరులు , అతిలోక సుందరీ మణులు" ఈ ఆటలో కొన్ని సినిమా పేర్లు , ఆభరణాల పేర్లు , డ్రెస్ ల పేర్లు ఇచ్చి వాటిని కేవలం సైగల ద్వారా మాత్రమే చెప్పమన్నారు. మరొక ముచ్చటైన ఆలోచన తో చేసిన మంచి ప్రయత్నం "పెళ్లి పుస్తకం".

ఇందులో మూడు తరాల జంటలను ఒకే వేదిక పైన కూర్చోబెట్టి , వారికి ఒకే రకమైన ప్రశ్నలు అడిగి , వాటికి వాళ్ళు ఎలా సమాధానం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. కార్యక్రమం చివరలో "నీ మనసు నాకు తెలుసు" అనే కార్యక్రమం ఎన్నో నవ్వుల పువ్వులు పూయించింది.

ఎన్నో కార్యక్రమాలు చూసినా భార్య భర్తల అనుభందానికి పెద్ద పీట వేసి చేసిన కార్యక్రమం కావడం , మన సంస్కృతి సంప్రదాయాల సుగంధాలను ఇలా అందరకు పంచడం చూసి ఎంతో సంతోషంగా ఉంది అని టాంటెక్స్అధ్యక్షుడు కాకర్ల విజయ మోహన్ అన్నారు.

ఈ కార్యక్రమానికి సరదా సన్నివేశాలతో రక్తి కట్టించిన యువకులు నట్టువ పవన్, బ్రహ్మాండం శశి లకు, ఎంతో అందంగా నడిపించిన నిడుమోలు పూర్ణిమ , దివాకర్ల మల్లిక్ లకు, వూటూరి శిరి , మురాల ఉమ గారికి, ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ప్రధాన పోషకదాతలు ఇర్వింగ్ నగరం లో ఉన్న "హాట్ బ్రెడ్స్ " వారికి , ఇతర పోషకదాతలు మయూరి ఇండియన్ రెస్టారెంటు , అవర్ ప్లేస్ ఇండియన్ రెస్టారెంటు మరియు బావర్చి ఇర్వింగ్ వారికి , ఉత్తరాధ్యక్షుడు ఊరిమిండి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆహ్వానితులకు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Prize distribution for 2014 events at TANTEX Sports Day conducted on Nov 8th at Andy Brown East, Coppell Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X