వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో బాలుకు స్వరార్చన

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ డిసి: అమెరికాలోని గ్రేటర్ వాషింగ్టన్ డిసి ప్రాంతంలోని గ్రీన్ బెల్ట్, మేరీల్యాండ్‌ స్థానిక రూజ్వెల్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో గత శనివారం సాయంత్రం "ఎన్నెన్నో జన్మల బంధం" పేరిట గాన గంధర్వుడు యస్పీ బాలుకి స్వరార్చన జరిగింది. చిమట మ్యూజిక్ అధినేత శ్రీనివాసరావు చిమట, స్థానికంగా తెలుగు కమ్యూనిటికి సేవలు చేస్తున్న శ్రీనివాసరావు చందుతో కలిసి ఈ సంగీత విభావరిని నిర్వహించగా దాదపుగా 800 మంది పాత తెలుగు పాటల సంగీతాభిమానులు ఆద్యంతం బాలు మధుర గీతాల సాగరం లో ఓలలాడటం ఒక విశేషం.

సూపర్ సింగర్ అంజనా సౌమ్య, జూనియర్ బాలుగా అమెరికాలో ముద్దుగా పిలుచుకునే రాము, అమెరికాలో వర్ధమాన గాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న సందీప్ కౌతలు కలిసి 4 గంటల పైగా దాదాపు 35 పాటలు పాడి అందరినీ అలరించారు. అమెరికాలో కేవలం అర్ధం పర్ధం లేని కొత్త పాటలకే డిమాండ్ ఉందనే ఒక పుకారును కొట్టి పారేస్తూ, నిజమైన తెలుగు మెలోడీలకు అమెరికా లో ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించడానికే చిమట మ్యూజిక్ సంస్థ ఇలాంటి సంగీత శ్రేణులను గత 5 యేళ్ళుగా అమెరికాలోని వివిధ నగరాల్లోని తెలుగు సంగీతాభిమానులకు అందిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.

Swararchana to Balasubramaniam in USA

ఈ కార్యక్రమానికి డాక్టర్ యడ్ల హేమ ప్రసాద్, డాక్టర్ సిరం సూర్యనారాయణ మూర్తి , అడపా ప్రసాద్, మూల్పూరి సుబ్బారావు ముఖ్య అతిధిలుగా విచ్చేయగా, తానా కార్యదర్శి సతీష్ వేమన "మైనే ప్యార్ కియా" కొత్త తెలుగు సినిమా ఆడియో టీజర్ ని ఆవిష్కరించారు.

ఇంటర్నేషనల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ఉదయ భాస్కర్ గంటి గ్రాండ్ స్పాన్సర్‌గా, యూనిఫై సొల్యూషన్స్ అధినేత, కొత్తగా వస్తున్న మైనే ప్యార్ కియా తెలుగు మూవీ నిర్మాత వెంకట్ సానా ప్లాటినం స్పాన్సరర్లుగా, ప్యారడైజ్ ఇండియన్ రెస్తారెంట్ ఫుడ్ వెండర్‌గా, మేరీలాండ్ మాంటిసోరి అకాడమీ, చట్నీ రెస్తారెంట్, కృష్ణా ట్రెయినింగ్ గోల్డ్ స్పాన్సరర్లుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పాన్సరర్లకు, వ్యాఖ్యాత గా వ్యవహరించిన మాధవి అమృతం, వాలంటీర్లకు ( శ్రీనివాస్ శీలంశెట్టి, వెంకటరెడ్డి యెర్రం, మనోజ్ చేకూరి, వెంకట్ వుండమట్ల, శివ బొల్లం, శ్రీనివాసులు నగరురు, రాజేష్ సుంకర, కృష్ణమోహన్ అమృతం, ఆనంద్ గుమ్మడిల్లి, చంద్రశేఖర్ కోలా, మనోజ్ భాగవతుల తదితరులు) శ్రీనివాస్ చందు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

English summary
NRIs organised musical nite to honour prominent singer Balasubrahmaniam in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X