వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఆజాద్ మృతికి ఎన్నారైలు సంతాపం ప్రకటించారు. కలాం ఆకస్మిక మృతి తీరని విషాదానికి గురిచేసిందని తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అధ్యక్షుడు వి చౌదరి జంపాల అన్నారు. ఆయన లాంటి మహనీయుడు చనిపోవడం దేశానికి తీరని లోటని చెప్పారు.

యువతను సన్మార్గంలో నడిపించేందుకు కలాం చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కేవలం రాష్ట్రపతి గానే కాకుండా శాస్త్రవేత్తగా కూడా కలాం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన సహజ వ్యక్తిత్వం, నిరాడంబరత నేటి యువతకు ఆదర్శమని చౌదరి తెలిపారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 TANA and ATA Mourns Former President Abdul Kalam's Passing Away

కలాం బాటలో పయనించాలి: ఆటా నివాళి

అబ్దుల్ కలాం మరణ వార్త తీవ్రంగా కలచివేసిందని ఆటా(అమెరికా తెలుగు సంఘం) అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. కలాం చూపిన బాటలోనే నేటి యువత పయనించాలని ఆయన ఆకాంక్షించారు. దేశమంతటికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి కలాం అని ఆటా సెక్రటరీ మాధవి చెప్పారు.

కలాం మరణం జాతి మొత్తానికి పూడ్చలేని లోటని ఆమె అన్నారు. కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జాయింట్ సెక్రటరీ సౌమ్య, జాయింట్ ట్రెజరర్ సురేష్.జిల్లా, ఆటా మాజీ అధ్యక్షుడు మాధవరం కరుణాకర్ తెలిపారు.

English summary
TANA joins Indians across the world in mourning the loss of Dr. AbdulKalam. His legacy will live for a long time, inspiring India to achieve greater heights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X