గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో తానా క్యాన్సర్ క్యాంపు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా నిర్వాహకులు గుంటూరులో గత శనివారం మెగా క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ ఫౌండేషన్, గుంటూరుకు చెందిన బైబిల్ మిషన్ భాగస్వాములయ్యాయి.

200మందికిపైగా ఫిజిషియన్లు, 400మంది నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, అనేక మంది వాలంటీర్లు ఈ క్యాంపులో సేవలందించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక రోజులో 2,790మంది మహిళలు బ్రీస్ట్, కార్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. 193మంది మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కార్వికల్ క్యాన్సర్ నివేదికలు రావాల్సి ఉంది.

క్యాన్సర్ ఉన్నట్లు తేలిన మహిళలకు వైద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రేస్ ఫౌండేషన్, ఫిజిషియన్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లకు తానా అధ్యక్షుడు డా. చౌదరి జంపాల, తానా ఫౌండేషన్ శ్రీనివాస గోగినేనిలు ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం విజయవంతమయ్యేది కాదని అన్నారు.

తానా ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అనాథ చిన్నారులకు భోజనం, ఆరోగ్యం, విద్య లాంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు తెలిపారు.

తానా డైరెక్టర్, అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, జయ్ తళ్లూరి, రమాకాంత్ కోయ, త్రిలోక్ కంతేటి, ప్రసాద్ గారపాటితోపాటు చాలా మంది ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. తానా ఫౌండేషన్ క్యాన్సర్ స్ర్కీనింగ్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు అశోక్ బాబు కొళ్ల, అనిల్ లింగమనేనిలు క్యాంపు నిర్వహణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కాగా, ఈ క్యాంపును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు.

మెగా క్యాన్సర్ క్యాంపు

మెగా క్యాన్సర్ క్యాంపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా నిర్వాహకులు గుంటూరులో గత శనివారం మెగా క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ ఫౌండేషన్, గుంటూరుకు చెందిన బైబిల్ మిషన్ భాగస్వాములయ్యాయి.

మెగా క్యాన్సర్ క్యాంపు

మెగా క్యాన్సర్ క్యాంపు

200మందికిపైగా ఫిజిషియన్లు, 400మంది నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, అనేక మంది వాలంటీర్లు ఈ క్యాంపులో సేవలందించారు.

మెగా క్యాన్సర్ క్యాంపు

మెగా క్యాన్సర్ క్యాంపు

ప్రాథమిక అంచనా ప్రకారం ఒక రోజులో 2,790మంది మహిళలు బ్రీస్ట్, కార్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. 193మంది మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కార్వికల్ క్యాన్సర్ నివేదికలు రావాల్సి ఉంది.

మెగా క్యాన్సర్ క్యాంపు

మెగా క్యాన్సర్ క్యాంపు

క్యాన్సర్ ఉన్నట్లు తేలిన మహిళలకు వైద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెగా క్యాన్సర్ క్యాంపు

మెగా క్యాన్సర్ క్యాంపు

ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రేస్ ఫౌండేషన్, ఫిజిషియన్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లకు తానా అధ్యక్షుడు డా. చౌదరి జంపాల, తానా ఫౌండేషన్ శ్రీనివాస గోగినేనిలు ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం విజయవంతమయ్యేది కాదని అన్నారు.

English summary
TANA Foundation, the charitable arm of Telugu Association of NorthAmerica (TANA), very successfully organized one of the biggestcancer-screening camps in the world in Guntur on Saturday, February20, 2017, in partnership with Grace Foundation of Hyderabad and BibleMission of Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X