అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేముసైతం: అమరావతి కోసం 'తానా' విరాళాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ముందుకొచ్చింది. My Brick- My Amaravati క్యాంపెయిన్‌లో భాగంగా రాజధాని అమరావతి కోసం విరాళాలు సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తానా అధ్యక్షుడు డా. వి. చౌదరి జంపాల ఈ విషయంపై మాట్లాడుతూ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎన్నారైల నుంచి విరాళాలు సేకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

 TANA raising funds for Andhra Pradesh Capital Amarvati Development

ఇందులో భాగంగా రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా ఒక ఇటుకను ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. దీనికి ‘మై బ్రిక్ - మై అమరావతి' అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ‘http://amaravati.gov.in/' వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ వెబ్ సైట్ ను ప్రారంభించిన కొద్ది క్షణాలకే సింగపూర్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఒకరు 108 ఇటుకలను ఈ సైట్ ద్వారా కొనుగోలు చేశారు. ఒక్కో ఇటుక ధర రూ.10గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ‘మై బ్రిక్ - మై అమరావతి'కి మద్దతుగా ఎన్నారైలు అందరూ తమ వంతు బాధ్యతగా సాయం అందించాలని ఆయన కోరారు.

మే, 2014 నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోసం తానా నిధులను సేకరిస్తుంది. తాజాగా ‘మై బ్రిక్ - మై అమరావతి' క్యాంపెయిన్‌కు నార్త్ అమెరికాలో ఉన్న ఎన్నారైలు సాధ్యమైనన్ని ఇటుకలను కొనుగోలు చేసి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

ఇక తానా విషయానికి వస్తే, విదేశాల్లో ఉన్న తెలుగు వారి బాగోగులు చూసేందుకు ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్. అంతేకాదు తానా చాలా పురాతనమైన తెలుగు అసోసియేషన్ కావడం విశేషం. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సంభవించిన తరుణంలో తానా తన వంతు సాయంగా $300,000 (రూ. 2 కోట్లు)ను సాయంగా అందించింది.

తానా ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే ఎన్నారైలు http://www.tana.org/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. ఒక డాలర్‌కు గాను 6 ఇటుకులు కొనుగోలు చేయవచ్చు. చెక్‌ల రూపంలో కూడా తానాకు విరాళాలను పంపించవచ్చు. చెక్‌లను TANA, 26233 Taft Rd, Novi, MI 48374 అడ్రస్‌కు పంపించండి. మెమో సెక్షన్‌లో ఏపీ క్యాపిటల్ ఫండ్ అని పేర్కొండి.

మరిన్ని వివరాలకు సంప్రదించండి
V. Chowdary Jampala, MD
President
Telugu Association of North America (TANA)
937-475-7809; [email protected]

English summary
Dr. V. Chowdary Jampala, President of Telugu Association of North America (TANA), announced today that TANA will accept donations from all non-resident Telugus who are interested in contributing to the development of Amaravati, the new capital of the state of Andhra Pradesh and to the new 'My Brick - My Amaravati' campaign on the eve of the Foundation Ceremony for the new capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X