వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుధుద్: అమెరికాలో తానా ‘స్వర తరంగిణి’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బోస్టన్: హుధుద్ తుఫాను బాధితుల సహాయనిధి కోసం అమెరికాలోని బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం(టిఏజిబి)తో కలసి తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన "స్వరతరంగిణి" కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. 1,000 మందికి పైగా ప్రవాసులు హాజరైన సంగీత హాస్య భరిత కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

ప్రముఖ గాయకులు హేమచంద్ర , శ్రావణ భార్గవి, విజయలక్ష్మి, పార్ణికలు హుషారైన పాత, కొత్త పాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి చేయూతగా తన స్వంత ఖర్చులతో రావటమే కాకుండా చివరివరకూ ఉండి తన మాటలు, డాన్సుతో అందరి మన్ననలూ పొందిన వర్ధమాన హీరో నాగశౌర్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ దివంగత నటులు ఎన్టీఆర్ స్వరంతో మొదలుపెట్టి రక రకాల హాస్యోక్తులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

గత నాలుగు దశాబ్దాలుగా తానా చేస్తున్న సేవల లఘు చిత్ర ప్రదర్శన తర్వాత, తానా ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ ఉత్తేజభరిత ప్రసంగం ఆకట్టుకుంది. తానా మాతృ భూమిలో చేస్తున్న వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, టీం స్క్వేర్ ద్వారా అమెరికాలో ఆపదలపాలైన తెలుగు వారిని ఆదుకొంటున్న తీరును, ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అందిస్తున్న సహాయసహకారాలను వివరించారు.

టిఏజిబి ప్రెసిడెంట్ రామ్ గుబ్బల తానా ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని, తానా ప్రతినినిధులు రవి పొట్లూరి, రావు యలమంచిలిలను సన్మానించారు. టిఏజిబి కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు డాక్టర్ ముద్దన హరిబాబు, గాయనీ గాయకులను, హీరో నాగ శౌర్య, మిమిక్రీ రమేష్‌లను శాలువాలతో సన్మానించారు. టిఏజిబి కార్యదర్శి తాళ్లూరి చంద్ర దాతలకు, స్పాన్సర్లకు, ప్రేక్షకులకూ టిఏజిబి కార్య కర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

హుధుద్ తుఫాను బాధితుల సహాయనిధి కోసం అమెరికాలోని బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం(టిఏజిబి)తో కలసి తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన "స్వరతరంగిణి" కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

1,000 మందికి పైగా ప్రవాసులు హాజరైన సంగీత హాస్య భరిత కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

ప్రముఖ గాయకులు హేమచంద్ర , శ్రావణ భార్గవి, విజయలక్ష్మి, పార్ణికలు హుషారైన పాత, కొత్త పాటలతో అందరినీ అలరించారు.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

ఈ కార్యక్రమానికి చేయూతగా తన స్వంత ఖర్చులతో రావటమే కాకుండా చివరివరకూ ఉండి తన మాటలు, డాన్సుతో అందరి మన్ననలూ పొందిన వర్ధమాన హీరో నాగశౌర్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

మిమిక్రీ కళాకారుడు రమేష్ దివంగత నటులు ఎన్టీఆర్ స్వరంతో మొదలుపెట్టి రక రకాల హాస్యోక్తులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

గత నాలుగు దశాబ్దాలుగా తానా చేస్తున్న సేవల లఘు చిత్ర ప్రదర్శన తర్వాత, తానా ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ ఉత్తేజభరిత ప్రసంగం ఆకట్టుకుంది.

స్వర తరంగిణి

స్వర తరంగిణి

తానా మాతృ భూమిలో చేస్తున్న వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, టీం స్క్వేర్ ద్వారా అమెరికాలో ఆపదలపాలైన తెలుగు వారిని ఆదుకొంటున్న తీరును, ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అందిస్తున్న సహాయసహకారాలను వివరించారు.

10,000 డాలర్లకు పైగా వచ్చిన విరాళాలు తానా ద్వారా తుఫాను సహాయ నిధికి అందించాలని టిఏజిబి కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో టిఏజిబి కార్యవర్గ సభ్యులు రామ్ గుబ్బల, శంకర్ మగపు, చంద్ర తాళ్లూరి, రాంకీ కొమ్మారెడ్డి, సీతారం అమరవాది, ప్రద్దేప్ రెడ్డి పెనుబోలు, భూపతిరాజు పెందేటి ట్రస్టీలు శ్రీనివాస్ కొల్లిపర, కర్రా మల్లారెడ్డి, ప్రకాష్ రెడ్డి, కోటేశ్వర రావు కందుకూరి, జనార్ధన్ శొంటి, శివ దోగిపర్తి, రమేష్ తల్లం, తదితురులు పాల్గొన్నారు.

English summary
Telugu Association of Greater Boston (TAGB) in association with TANA organized a fundraising musical night, Swara Tarangini on November 1, 2014 at Littleton High School, Littleton, MA to support TANA’s Hudhud cyclone relief efforts in Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X