వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగును కాపాడుకుందాం: తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో అతిథులు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : అమెరికా లోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యం లో 40కి పైగా దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలు కలిసి గత పది రోజులగా నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవములు ఆగష్టు రెండవ తేదీ సాయంత్రం ముగిశాయి. గతనెల జులై 24 వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రారంభమై పదిరోజులపాటు ఉత్సవ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.వెబ్-ఎక్ష్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సమారోహ సంబరాలకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి అధ్యక్షత వహించగా శిరీష తూనుగుంట్ల సమన్వయ కర్త గా వ్యవహరించారు .

ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయ ప్రకాష్ నారాయణ, తెలంగాణ సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్, డి.ఆర్.డి.వో చైర్మన్ సతీష్ రెడ్డి, జి.ఎం.ఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు గారు మాట్లాడుతూ కరోనా సమయం లో ఇటువంటి కార్యక్రమం రూపాందించడం, సాంస్కృతిక పోటీలలో 18000 మంది తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనడం అభినందననీయం అని అన్నారు.

TANA Telugu cultural programme concludes, Function attended by Srinivas Goud and Jayaprakash Narayan

ప్రతి ఆపద సమయాన్ని తెలుగు వారు ఉపయోగంగా మలచుకొని ఎలా ముందుకెళతారో నిరూపించారు అని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరిని మహిళా విభాగ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల ను ప్రశంసించారు .తెలుగు భాషకు సంస్కృతికి ఈ ఉత్సవాలు గొప్ప భరోసాను ఇచ్చాయని తెలుగు భాషకు ఏ ప్రమాదం రాదని ఈ ఉత్సవాలని చూసిన తరవాత అనిపించాయి అన్నారు.

TANA Telugu cultural programme concludes, Function attended by Srinivas Goud and Jayaprakash Narayan

ప్రధాన అంశాలు అయినా సౌందర్య లహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెలరవళి, కళాకృతి, రంగస్థలం, భువన విజయం జరిగిన పోటీలలో నెగ్గిన విజేతల పేర్లు ప్రకంటించారు. వివిధ దేశాలకు చెందిన 485 మంది విజేతలగా నిలిచారు. వారందరికీ బహుమతులు సర్టిఫికెట్లు అంద చేస్తున్నామని అన్నారు . సాయంత్రం 6 గంటలకు మొదలు అయిన సంబరాలు మరునాడు ఉదయం 3 గంటల వరుకు కొనసాగాయి.

TANA Telugu cultural programme concludes, Function attended by Srinivas Goud and Jayaprakash Narayan

ప్రపంచం నలు మూలలనుండి వివిధ టైం జోన్స్ కి చెందిన తెలుగు వారు పాల్గొన్నారు. అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొనడం గమనించ తగిన విషయం . వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు మాట్లాడుతు ఈ ఉత్సవాలు ఒక మధురానుభూతిగా నిలిచి పోతుంది అని, ఎక్కడెక్కడ వారమో తానా కృషి ఫలితం గా ఒక్క వేదిక పై కలుసుకున్నాము అని తామంతా తెలుగు భాష ను రక్షించుకోవడంలో సైనికుల లాగా పని చేస్తామని ప్రకటించారు.

TANA Telugu cultural programme concludes, Function attended by Srinivas Goud and Jayaprakash Narayan

ఈ సమావేశాలలో జస్టిస్ వంగల ఈశ్వరయ్య, పద్మ శ్రీ మల్లేశం, తానా పూర్వ అధ్యక్షులు జంపాల చౌదరి, రంగస్థల నటులు మీగడ రామ లింగ స్వామి , గుమ్మడి గోపాల కృష్ణ, తానా ప్రముఖలు హరి కోయ, జయశేఖర్ తాళ్లూరి, భారతీయం సత్య వాణి మొదలగువారు అతిధులుగా పాల్గున్నారు . చివరగా అతిథులంతా ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలని నిర్వహించాలి అని కోరగా తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి గారు "ఎల్లలులేని తెలుగు - ఎప్పటికి తెలుగు" అనే కార్యక్రమం క్రింద ఇలాంటి ఉత్సవాలని నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలను పురస్కరించుకొని 10 లక్షల రూపాయల విరాళాన్ని చేనేత కార్మికులు కోసం పేద కళాకారుల కోసం ప్రకటించారు . చివరిగా శిరీష తూనుగుంట్ల వందన సమర్పణ చేశారు.

English summary
Tana had concluded its cultural programme on 2nd of August. This concluding ceremony was attended by dignitaries such as Minister Srinivas Goud and Jayaprakash Narayan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X