వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాంటెక్స్ ‘కాళిదాసు కవితా సౌరభం’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

క్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఫిబ్రవరి 21న దేశీప్లాజా స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషమని నిర్వాహకులు తెలిపారు.

డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు. బిళ్ళ ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 103వ నెల నెలా తెలుగు వెన్నెల అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు జరుపుకోవడం ఎంతో విశేషమని అన్నారు.

మాసానికో మహనీయుడు శీర్షికన వరిగొండ శ్యాం 'భారతకోకిల' సరోజినీ నాయుడు ప్రతిభ గురించి మాట్లాడుతూ.. ఉదాహరణకి ఆమె వ్రాసిన "Palanquin bearers" ద్వారా భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చెప్పారని కొనియాడారు.

ఐఐటి కోచింగ్ లో ప్రసిద్ధులు, 'ఐఐటి రామయ్య' అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ చుక్కా రామయ్య 'ప్రతిభ సమత్వం' అనే పుస్తకాన్ని మార్తినేని మమత సభకు పరిచయం చేశారు. 'ప్రాధమిక విద్య మాతృభాషలో వుండాలి అని నమ్మినవారిలొ అయన ఒకరు. ఈ పుస్తకంలో ప్రధానంగా- విద్యను వ్యాపారంగా మార్చకూడదు, విద్యను ఆర్ధిక, వర్ణ, వయో, లింగ భేదాలు లేకుండా అందరికి సమానంగా అందించాలి. సమతుల్యం లోపించినప్పుడు అగాధాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుందని రామయ్య వివరించారు' అని తెలియచేశారు.

ఇక, య్యుని శ్రీనివాస్ పాడిన 'ఎలా ఈ మధుమాసం' అనే సినారే గీతం, ఇతర లలితా గీతాలు, ప్రభోధగీతాలు, మంగళ గీతాలు అందరి మనసులను అలరి౦చాయి. వీటికి వాద్య సహకారం మహాభాష్యం సాయి రాజేష్ అందించారు.

ముఖ్యఅతిథి మాడ దయాకర్‌ని సమన్వయ కర్త బిళ్ళ ప్రవీణ్ వేదికపైకి ఆహ్వానించగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు, పూర్వ సాహిత్య వేదిక సమన్వయ కర్త కన్నెగంటి చంద్ర పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. మాడ దయాకర్ కవి కాళిదాసు యొక్క కవితా వైభవము అనితరమని ఆయన కావ్య పరిమళాలు ఖండాంతరాలలో వ్యాపించాయని వివరించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఫిబ్రవరి 21న దేశీప్లాజా స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషమని నిర్వాహకులు తెలిపారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు. బిళ్ళ ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 103వ నెల నెలా తెలుగు వెన్నెల అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు జరుపుకోవడం ఎంతో విశేషమని అన్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

మన మాతృభాష మనకే కాక ఇతరులకూ విన సొంపైన భాష, సులువైన భాష, రచనలకైనా, భావ వ్యక్తీకరణకైనా సరళమైన భాష, సరసమైన భాష అని కొనియాడుతూ విచ్చేసిన సాహితీ ప్రియులందరికి శుభాభినందనలు తెలియ చేసారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

కార్యక్రమంలో ముందుగా పోతన భాగవతా పీఠికలోని ప్రార్ధన పద్యాలను చిన్నారులు మాడ సంహిత, మాడ సమన్విత, కర్రి యశస్వి భావయుక్తంగా పాడారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఇక దొడ్ల రమణ పోతన పదప్రయోగాల గురించి వివరిస్తూ.. ఓ సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో బమ్మెర పోతన దిట్ట అని, శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై పట్టే కాకుండా భావంపైన పూర్తి నియంత్రణ సాధించిన మహాకవి అని చెప్పారు. మరికొన్ని పోతన పద్యాలను డా. పుదూరు జగదీశ్వరన్ సభలో రసవత్తరంగా ఆలపించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

మాసానికో మహనీయుడు శీర్షికన వరిగొండ శ్యాం ‘భారతకోకిల' సరోజినీ నాయుడు ప్రతిభ గురించి మాట్లాడుతూ.. ఉదాహరణకి ఆమె వ్రాసిన "Palanquin bearers" ద్వారా భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చెప్పారని కొనియాడారు.

కాళికాదేవి మహిమతో సాదారణ కాళిదాసు ఎలా విద్వాంసుడిగా మారారో వివరించి, కాళిదాసు కావ్యాలలోని వాగర్ధ శోభను, అలంకార వైభవాన్ని చాటే శ్లోకాలను, వాటి వెనకున్న అర్ధాలను,కథలను భావయుక్తంగా వినిపించారు. మేఘ సందేశపు కథని, కథనాన్ని అందులో నిగూఢమయిన ఎన్నో విశేషాలను వినిపించి మురిపించారు.

'కావ్యేషు నాటకం రమ్యం' అన్నది ఎంతో అర్ధవంతమైనదనీ, అందులోనూ 'అభిజ్ఞాన శాకుంతలం' కడు రమణీయమయినదనీ చెబుతూ, కాళిదాసు కవిత్వ సారమంతా ఈ ఒక్క కావ్యం చదివినా అవగతమవుతుందన్నారు. అంత సమయం లేకపోతే అందులో నాలుగవ అంకం చదివినా అదీవీలవకపోతే అందులోని నాలుగవ అంకం లోని నాలుగు శ్లోకాలు చదివినా ఆ రమణీయత అర్ధమవుతుందని చెప్పారు.

అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు' ఏప్రిల్ 16న ఇర్వింగ్ హైస్కూల్ లో జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు.

సాహిత్య వేదిక సభ్యులు డా. కలవగుంట సుధ, మార్తినేని మమత ముఖ్య అతిథి మాడ దయాకర్‌ని శాలువాతో, సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణవేణి శీలం, కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గ సభ్యులు తోట పద్మశ్రీ, పాలేటి లక్ష్మి, పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, మార్తినేని మమత, దిండుకుర్తి నగేష్, వరిగొండ శ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ.. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Tantex 103rd nela nela vennela programme held in Texas in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X