వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ‘టాంటెక్స్ మైత్రి’ హల్‌చల్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో ‘సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఓనమాలు' శిక్షణా శిబిరం ఆదివారం(నవంబర్ 8న)నాడు రెక్స్ ప్రోగ్రామింగ్ వారి ట్రైనింగ్ సెంటర్‌లో మైత్రి సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించబడింది.

ప్రవాసంలో నివసిస్తున్న, భారతదేశం నుండి తమ పిల్లలతో గడపడానికి విచ్చేసిన తల్లిదండ్రుల కోసం టాంటెక్స్ ఏర్పాటు చేసిన వేదిక ఈ మైత్రి. ఈ వేదికలో గతంలో జరిగిన కార్యక్రమాలకు భిన్నంగా, నేటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సోషల్ నెట్వర్కింగ్‌'లో ఓనమాలు' శీర్షికలో మొదటిగా ఫేస్‌బుక్ అంటే ఏమిటి, వాడటం ఎలా, గమనించవలసిన విషయాలు, జాగ్రత్తలు మొదలైన అన్ని అంశాలను తెలియచేశారు.

మూడు గంటలపాటు సాగిన శిక్షణా శిబిరం, కాలేజి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ, కాఫీ, సమోసాలతో, సరదా సంభాషణలతో, నేర్చుకున్న విషయాలను అప్పటికప్పుడు స్వయంగా చేస్తూ అంతా ఉత్సాహంగా నేర్చుకున్నారు.

టాంటెక్స్ మైత్రి

టాంటెక్స్ మైత్రి

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో ‘సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఓనమాలు' శిక్షణా శిబిరం ఆదివారం(నవంబర్ 8న)నాడు రెక్స్ ప్రోగ్రామింగ్ వారి ట్రైనింగ్ సెంటర్‌లో మైత్రి సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించబడింది.

టాంటెక్స్ మైత్రి

టాంటెక్స్ మైత్రి

ప్రవాసంలో నివసిస్తున్న, భారతదేశం నుండి తమ పిల్లలతో గడపడానికి విచ్చేసిన తల్లిదండ్రుల కోసం టాంటెక్స్ ఏర్పాటు చేసిన వేదిక ఈ మైత్రి.

టాంటెక్స్ మైత్రి

టాంటెక్స్ మైత్రి

ఈ వేదికలో గతంలో జరిగిన కార్యక్రమాలకు భిన్నంగా, నేటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సోషల్ నెట్వర్కింగ్‌'లో ఓనమాలు' శీర్షికలో మొదటిగా ఫేస్‌బుక్ అంటే ఏమిటి, వాడటం ఎలా, గమనించవలసిన విషయాలు, జాగ్రత్తలు మొదలైన అన్ని అంశాలను తెలియచేశారు.

టాంటెక్స్ మైత్రి

టాంటెక్స్ మైత్రి

మూడు గంటలపాటు సాగిన శిక్షణా శిబిరం, కాలేజి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చింది.

మైత్రి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘టాంటెక్స్ మా కోసం ఈనాటి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని, తమ పిల్లలు మనవళ్ళు మనవరాండ్లతో సరదాగా పోటీ పడుతూ ఇప్పటి తరానికి నచ్చేలా దగ్గరవడానికి ఇదొక మార్గం అవగలదు' అనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, పాలకమండలి సభ్యులు రొడ్డా రామకృష్ణ, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెక్స్ ప్రోగ్రామింగ్ అధినేత్రి పడాల సంధ్య మాట్లాడుతూ.. టాంటెక్స్ మైత్రి కార్యక్రమంలో తమను భాగస్వామ్యులను చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. కుమారి జొన్నలగడ్డ సాయి ప్రణవి చక్కగా అందరికి అర్ధమయేలా నేర్పించారు.

సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మైత్రి సభ్యులు కోరిన విధంగా త్వరలో ఆరోగ్య పరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకొని కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియచేశారు. ఎంతో ఉత్సాహంతో పాల్గొని కొత్తగా చేసిన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
TANTEX MAITRI, a Social Networking programme has been held in Dallas by Tantex for indian parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X