వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లాసంగా సాగిన ‘నెల నెలా తెలుగు వెన్నెల’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డల్లాస్: తెలుగు సాహిత్య సేవల్లో నిర్విరామంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స) నిర్వహించే ‘నెల నెలా తెలుగు వెన్నెల' అష్టమ వార్షికోత్సవం జులై 12న మలంకార చర్చి ఆడిటోరియంలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. పద్యం, హాస్యం ప్రధాన ఇతివృత్తాలుగా సాగిన ఈ వేడుక పిల్లలు, పెద్దల భాగస్వామ్యంలో ఎంతో సందడిగా, మన ఇంటిలో వేడుకలా ఆద్యంతము ఉల్లాసంగా జరిగింది.

అన్నమయ్య, త్యాగయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, క్షేత్రయ్య, నారయణ తీర్థులు, రామదాసు వంటి వాగ్గేయకారులు శృంగారం, భక్తి వగైరాలే కాక ఆనాటి సాంఘిక పరిస్థితులను స్పష్టం చేస్తూ పదాలు రచించారు. వారు లోకాన్ని దర్శించిన ప్రఙ్ఞ, సంగీత, సాహిత్యాలను కరతలామలకం చేసుకోగలిగిన నిష్ఠ, దాన్ని ప్రభోదాత్మకంగా, రంజకంగా, నవనవోన్మేషంగా పునః సృష్టి చేసిన తీరును నృత్యరూపకం ద్వారా చక్కగా వివరించారు.

ఈ నృత్యరూపకంలో త్యాగయ్యగా ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, సాహిత్య వేదిక సభ్యులు సుబ్బు దామిరెడ్డి గురువుగా, అన్నమయ్యగా నాగ సురేష్ సుగ్గల, మునిపల్లె సుబ్రమణ్య కవిగా వరిగొండ శ్యాం, రాముడి పాత్రలో జలసూత్రం చంద్రశేఖర్, నారాయణ తీర్ధులుగా బసాబత్తిన , సంయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం శ్రీరామదాసు పాత్రలలో అలరించారు.

అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సర ప్రధమార్ధంలో నిర్దేశించిన "ప్రగతి పధములో పది సూత్రాలు" ఒక్కొక్కటి క్రమంగా కార్యరూపం దాల్చడం, నెరవేర్చడం చాల సంతోషంగా వుందన్నారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

తెలుగు సాహిత్య సేవల్లో నిర్విరామంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స) నిర్వహించే ‘నెల నెలా తెలుగు వెన్నెల' అష్టమ వార్షికోత్సవం జులై 12న మలంకార చర్చి ఆడిటోరియంలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

పద్యం, హాస్యం ప్రధాన ఇతివృత్తాలుగా సాగిన ఈ వేడుక పిల్లలు, పెద్దల భాగస్వామ్యంలో ఎంతో సందడిగా, మన ఇంటిలో వేడుకలా ఆద్యంతము ఉల్లాసంగా జరిగింది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

ముఖ్య అతిధి తురిమెళ్ళ శంకర నారాయణ, విలక్షణ అతిధి గుమ్మడి గోపాలకృష్ణ, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి, ప్రత్యేక అతిధి అమల్లదిన్నె పద్మజ, టాంటెక్స్ కార్యవర్గం, పాలకమండలి సభ్యులు, సాహిత్య వేదిక సభ్యుల జ్యోతి ప్రజ్వలనతో సభ ఘనంగా ప్రారంభమైంది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

చిన్నారి చావలి ఉమ సరస్వతి నమోస్తుతె ప్రార్ధనా గీతం వీనులవిందుగా ఆలపించింది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ ప్రారంభోపన్యాసం చేస్తూ మన సాహితీ సంపదను కాపాడుకోవడానికి, సాహితీ పండితులను గౌరవించడానికి ప్రయత్నం ఒక ఎత్తయితే, వీటిని భావితరాలకు అందించడం అంతే ముఖ్యమని, ఈ సంవత్సంలో ఇంతవరకు దాదాపు 30 మంది బాల బాలికలు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన తీరును కళ్లకద్దినట్లు వివరించారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

మన భాష, సాహిత్యం విరాజిల్లేందుకు చేయి చేయి కలిపి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

చావాలి మంజు హేమమాలిని సమర్పణలో గురు పరంపర డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ బాలబాలికల సంగీత విభావరిలో దరువర్ణం మాతే మలయధ్వజ, బ్రహ్మ మొక్కటే అతి మధురంగా గానం చేసి ఆహుతుల హర్షద్వానాలు అందుకున్నారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

ప్రత్యేక అతిధి పద్మజ అమల్లదిన్నె(మల్లాది) పద్య పఠన ప్రాముఖ్యత ప్రసంగం ఒక ప్రవాహంలా సాగి, నన్నయ్య నావాడని, పోతన నావాడని వాదించే ఉదాహరణలో, అచ్చులని హల్లులని ఎలా విడదీయలేమో అలాగే పద్యాలని కూడా ప్రాంతాలవారీగా విడదీయలేమని, పద్యం తెలుగువాడి సొంతమని కొనియాడారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

దొడ్ల రమణ పోతన భావతంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి, సభలోని వారి అందరిచేత ఔరా అనిపించుకున్నారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

ముఖ్యంగా మూడేళ్ళ మాడ సమన్విత, నాలుగేళ్ళ రిషికేష్ సిద్ధార్థ రాగ భావయుక్తముగా చదివిన తీరు ఆహుతులని మంత్రముగ్దులని చేసింది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

విలక్షణ అతిధి గుమ్మడి గోపాలకృష్ణ రాయభారం పద్యాలను శ్రీకృష్ణుడు వేషములో ఆలపించి అందరిని పద్య నాటకపు రోజులలోకి తీసుకువెళ్ళారు. చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని పద్యాలకు సభ దద్దరిల్లింది.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

విశిష్ఠ అతిధి డా.కేతు విశ్వనాథరెడ్డి "మన తెలుగు మనం" అంశంపై ప్రసంగిస్తూ సాహిత్యం భాషలో ఒక భాగమే కాని సాహిత్యం మాత్రమే భాష కాదని, శుధ్ధ భాష అంటూ ప్రత్యేకంగా ఉండదని, మాండలికాలు వేరైనా భాష అంతా ఒకటేనని భాషా దురభిమానము తగదని హితవు చెప్పారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

డా. కలవగుంట సుధ సమర్పణలో తెలుగు భాషా, సాహిత్యం, సంగీతం, సంస్కృతి సంప్రదాయాలకు అద్వితీయమైన సేవలందించిన ప్రముఖ తెలుగు వాగ్గేయకారులను స్మరించుకుంటూ తెలుగు సాహిత్య వేదిక సభ్యులు మరియు లాస్యసుధ నృత్య అకాడమీ శిష్య బృందం సమన్వయంగా "తెలుగు వాగ్గేయకారులు" నృత్య రూపకాన్ని కన్నుల పండువగా ప్రదర్శించారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

అన్నమయ్య, త్యాగయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, క్షేత్రయ్య, నారయణ తీర్థులు, రామదాసు వంటి వాగ్గేయకారులు శృంగారం, భక్తి వగైరాలే కాక ఆనాటి సాంఘిక పరిస్థితులను స్పష్టం చేస్తూ పదాలు రచించారు.

‘నెల నెలా తెలుగు వెన్నెల'

‘నెల నెలా తెలుగు వెన్నెల'

వారు లోకాన్ని దర్శించిన ప్రఙ్ఞ, సంగీత, సాహిత్యాలను కరతలామలకం చేసుకోగలిగిన నిష్ఠ, దాన్ని ప్రభోదాత్మకంగా, రంజకంగా, నవనవోన్మేషంగా పునః సృష్టి చేసిన తీరును నృత్యరూపకం ద్వారా చక్కగా వివరించారు.

ముఖ్య అతిథి హాస్య బ్రహ్మ శంకరనారాయణ హాస్యావధానంలో తన ప్రతి మాటలో హాస్యాన్ని కురిపిస్తూ సభికులని నవ్వుల్లో ముంచారు. భార్య లాండ్ లైన్, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ అంటూ వారు చెప్పిన పోలికలకు అందరూ కడుపుబ్బా నవ్వారు. హాస్య ప్రసంగం తదుపరి పూదూర్ జగదీశ్వరన్ సంధాత‌గా వ్యవహరించగా, డా. ఆళ్ళ శ్రీనివాస్రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, ప్రభల శ్రీనివాస్, శ్రీ జలసూత్రం చంద్రశేఖర్, రాయవరం భాస్కర్, మల్లాది పద్మజ, మాడ దయాకర్ పృచ్చకులుగా హాస్యావధానంలో పాల్గొన్నారు.

గుమ్మడి గోపాలకృష్ణ సుభద్రపై పద్యం చదవమనగా శంకరనారాయణ చక్కగా పద్యాన్ని కూర్చి ఆలపించారు. ఈ మధ్యనే విడుదల అయిన బాహుబలి చిత్రంలోని కాలకేయుడి భాష గురించి రాయవరం భాస్కర్ ప్రశ్నించగా సరదాగా జవాబిచ్చారు. మగవారి గొప్పదనం గురించి ఆడవాళ్ళు చెప్పుకుంటారా? అన్న జలసూత్రం చంద్రశేఖర్ ప్రశ్నకు ఇచ్చిన జవాబు సభికులని నవ్వుల్లో ముంచింది.

మల్లాది పద్మజ, విశ్వనాధ సత్యనారాయణ ఈరోజుల్లో ఉంటే సెల్ ఫోనులో ఏమి మాట్లాడేవారని అడిగిన ప్రశ్నకు కూడా ఎంతో తెలివిగా సమధానమిచ్చి మళ్ళీ సభికుల్ని కడుపుబ్బా నవ్వించారు. మీ పేరులో శంకరుడున్నాడు, నారాయణుడున్నాడు, వీరిద్దరిలో మీరెవరిని ఎంచుకుంటారు, అని ప్రభల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు.

అట్లూరి స్వర్ణ సభా ప్రాంగణాన్ని అలంకరణ చేసిన తీరు, అన్ని అంశాలను మంచి ఆలోచనతో కూర్పు చేసిన పూర్వ సాహిత్య కార్యక్రమ ఛాయా చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి క్రష్ణారెడ్డి, కార్యదర్శి మహేష్ ఆదిత్య ఆదిభట్ల, కోశాధికారి శీలం క్రష్ణవేణి, పాలకమండలి సభ్యులు రొడ్డ రామక్రష్ణా రెడ్డి, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం సింగిరెడ్డి శారద, బిళ్ళ ప్రవీణ్, వనం జ్యోతి, గోవాడ అజయ్, పాలేటి లక్ష్మి, వీర్నపు చినసత్యం, పావులూరి వేణు ముఖ్య అతిధి తురిమెళ్ళ శంకర నారాయణ, విలక్షణ అతిధి గుమ్మడి గోపాలకృష్ణ, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి, ప్రత్యేక అతిధి శ్రీమతి అమల్లదిన్నె పద్మజ, చలనచిత్ర నటులు నందమూరి తారకరత్న, సంగీత దర్శకులు నేమాని పార్థసారథికి పుష్పగుచ్చ్చం, శాలువ, జ్ఞాపికతో సత్కరించారు.

సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ.. 96 నెలలు ఒక యజ్ఞంలా 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రం నిరాటంకంగా సాగడానికి కారకులైన సభ్యులకు, కార్యకర్తలకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పోశకదాతలకు ధన్యవాదాలు తెలిపారు.

English summary
Tantex 'nela nela vennela' programme held in Dallas, in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X