వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాంటెక్స్: అలరించిన ‘స్వరమాధురి’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: డల్లాస్ నగరంలోని దేశీ ప్లాజా స్టూడియోలో జూన్ 20న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ, ఢిల్లీ తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించిన ‘స్వరమాధురి' కార్యక్రమం ప్రేక్షకులను ఆనంద సాగరంలో ముంచెత్తింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడెమీ కార్యదర్శి శ్రీ. ఎన్‌విఎల్ నాగరాజు, వారి సతీమణి లక్ష్మి, టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద బృందం, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, అతిథులు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు.

టాంటెక్స్ అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డా. కోమండూరి రామాచారితో టాంటెక్స్ సంస్థకున్న ఐదు సంవత్సరాల అనుబంధాన్ని, స్థానిక చిన్నారులకు సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. 18 సంవత్సరాలకు పైబడ్డ స్థానిక గాయనీగాయకలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న "స్వరమంజరి" కార్యక్రమాన్ని గురించి తెలిపారు.

ఢిల్లీ తెలుగు అకాడెమీ గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న అనేక కార్యక్రమాలను, ఎన్‌విఎల్ నాగరాజు నిస్స్వార్ధ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమలో డా. కోమండూరి రామాచారి గారి శిష్యులైన సూపర్ సింగర్స్, ప్లే బాక్ సింగర్స్, సత్యయామిని, నిహారిక, కశ్యప్ మనోజ్, కౌత అశ్విన్‌లు సినిమాల్లోని పాత-కొత్త పాటలను పాడి వినిపించారు.

వీరితో పాటు డా. కోమండూరి రామాచారి శిష్యులైన డల్లాస్ నివాసులు పూనూరు సంజన, కస్తూరి ప్రణవ్, జంగేటి మహిత, ధర్మపురం స్నేహ, వాస్కర్ల శ్రియ, వట్టికుట్టి వెన్నెల, పటేల్ ఆనికా, పండుగు శ్రీయ, సుంకిరెడ్డి అవని, పూజిత కొమ్మెర, కౌత రితి,కౌత శ్రీలక్ష్మి,కౌత అన్విత్ కూడా వారు స్వర పరచిన సరిగమ పదని స్వరాలే, సారే జహాన్ కొ ప్యారా హిందూస్తాన్ హమారా, ఒక రాగం పలకాలంటే వంటి పాటలను పాడి ప్రతిభను చాటుకున్నారు.

ఢిల్లీ తెలుగు సంఘం, ఎన్‌విఎల్ నాగరాజు, వారి సతీమణి లక్ష్మి 30 సంవత్సరాలుగా కళలపైనున్న మక్కువతో ఎంతోమంది కళాకారులను, కళాపోషకులను, కూడా ప్రోత్సహించి వారి కళాదరణను చాటారు.

స్వరమాధురి

స్వరమాధురి

డల్లాస్ నగరంలోని దేశీ ప్లాజా స్టూడియోలో జూన్ 20న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ, ఢిల్లీ తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించిన ‘స్వరమాధురి' కార్యక్రమం ప్రేక్షకులను ఆనంద సాగరంలో ముంచెత్తింది.

స్వరమాధురి

స్వరమాధురి

ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడెమీ కార్యదర్శి శ్రీ. ఎన్‌విఎల్ నాగరాజు, వారి సతీమణి లక్ష్మి, టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద బృందం, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, అతిథులు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు.

స్వరమాధురి

స్వరమాధురి

భావానికి తగిన రాగాన్ని జోడించి భావప్రకటితం చేస్తూ గానాలాపన చేసే సంగీత గాయకుడు డా. కోమండూరి రామాచారి మధురగాయకునిగా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు గడించారు.

స్వరమాధురి

స్వరమాధురి

‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ'ని స్థాపించి ఇటు భారదేశంలోనే కాకుండా అమెరిక, ఆస్ట్రేలియా, యూరప్ వంటి పాశ్చాత్యదేశాల్లో ఎంతో మంది శిష్యులకు శిక్షణనిచ్చి వారిచేత ప్రదర్శనలు ఇప్పిస్తూ యావత్ ప్రపంచాన్ని సంగీత సాగరంగా చేసి ఎందరో ప్రముఖుల చేత మన్ననలను పొందారు.

స్వరమాధురి

స్వరమాధురి

టాంటెక్స్ అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డా. కోమండూరి రామాచారితో టాంటెక్స్ సంస్థకున్న ఐదు సంవత్సరాల అనుబంధాన్ని, స్థానిక చిన్నారులకు సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు.

స్వరమాధురి

స్వరమాధురి

18 సంవత్సరాలకు పైబడ్డ స్థానిక గాయనీగాయకలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న "స్వరమంజరి" కార్యక్రమాన్ని గురించి తెలిపారు.

స్వరమాధురి

స్వరమాధురి

ఢిల్లీ తెలుగు అకాడెమీ గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న అనేక కార్యక్రమాలను, ఎన్‌విఎల్ నాగరాజు నిస్స్వార్ధ సేవలను కొనియాడారు.

స్వరమాధురి

స్వరమాధురి

ఈ కార్యక్రమలో డా. కోమండూరి రామాచారి గారి శిష్యులైన సూపర్ సింగర్స్, ప్లే బాక్ సింగర్స్, సత్యయామిని, నిహారిక, కశ్యప్ మనోజ్, కౌత అశ్విన్‌లు సినిమాల్లోని పాత-కొత్త పాటలను పాడి వినిపించారు.

స్వరమాధురి

స్వరమాధురి

వీరితో పాటు డా. కోమండూరి రామాచారి శిష్యులైన డల్లాస్ నివాసులు పూనూరు సంజన, కస్తూరి ప్రణవ్, జంగేటి మహిత, ధర్మపురం స్నేహ, వాస్కర్ల శ్రియ, వట్టికుట్టి వెన్నెల, పటేల్ ఆనికా, పండుగు శ్రీయ, సుంకిరెడ్డి అవని, పూజిత కొమ్మెర, కౌత రితి,కౌత శ్రీలక్ష్మి,కౌత అన్విత్ కూడా వారు స్వర పరచిన సరిగమ పదని స్వరాలే, సారే జహాన్ కొ ప్యారా హిందూస్తాన్ హమారా, ఒక రాగం పలకాలంటే వంటి పాటలను పాడి ప్రతిభను చాటుకున్నారు.

స్వరమాధురి

స్వరమాధురి

ఢిల్లీ తెలుగు సంఘం, ఎన్‌విఎల్ నాగరాజు, వారి సతీమణి లక్ష్మి 30 సంవత్సరాలుగా కళలపైనున్న మక్కువతో ఎంతోమంది కళాకారులను, కళాపోషకులను, కూడా ప్రోత్సహించి వారి కళాదరణను చాటారు.

స్వరమాధురి

స్వరమాధురి

ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేయూత నిచ్చిన తమ జట్టు సభ్యులు సుంకిరెడ్డి నరేష్, దిన్డుకుర్తి నగేష్ బాబు, పంచార్పుల ఇంద్రాణి, తోటకూర పల్లవి, తెలకలపల్లి జయ, సుంకిరెడ్డి మాధవి, దండెబోయిన నాగరాజు, గంగాధర పవన్, మార్తినేని మమతలకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

స్వరమాధురి

స్వరమాధురి

నేపధ్యగాయనీమణులైన సత్య యామిని, నీహారిక, మనోజ్ కశ్యప్ మరియు స్థానిక చిన్నారులను అభినందించారు.

‘స్వరమాధురి' కార్యక్రమంలో వారు హ్యుస్టన్ నుండి స్వచ్ఛంద సేవకులు బంగారు రెడ్డి, నృత్య కళాకారిణి కోసూరి ఉమాభారతి, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నుండి సింగిరెడ్డి శారద, పూనూరు కమలాకర్, నాటా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు దర్గా రెడ్డి, కార్యక్రమం పోషకదాత జి అండ్ సి మల్లిక్, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, పాలక మండలి అధిపతి అజయ్ రెడ్డిలకు ప్రవాస తెలుగువారికి చేస్తున్న నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా ఙ్ఞాపికను బహూకరించి, దుశ్శాలువాలతో సత్కరించారు.

ఊరిమిండి నరసింహా రెడ్డి , ఉత్తరాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆదిత్య ఆదిభట్ల మహేష్, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, బిల్లా ప్రవీణ్, గజ్జల రఘు, పాలకమండలి సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, రుమల్ల శ్యామ, ఎన్‌విఎల్ నాగరాజుకి, లక్ష్మికి పుష్ప గుచ్ఛాలతో, దుస్సాలువాలతో సంప్రాదాయ బద్దంగా సన్మానించారు.

ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేయూత నిచ్చిన తమ జట్టు సభ్యులు సుంకిరెడ్డి నరేష్, దిన్డుకుర్తి నగేష్ బాబు, పంచార్పుల ఇంద్రాణి, తోటకూర పల్లవి, తెలకలపల్లి జయ, సుంకిరెడ్డి మాధవి, దండెబోయిన నాగరాజు, గంగాధర పవన్, మార్తినేని మమతలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. నేపధ్యగాయనీమణులైన సత్య యామిని, నీహారిక, మనోజ్ కశ్యప్ మరియు స్థానిక చిన్నారులను అభినందించారు.

English summary
Tantex 'Swaramadhuri' programme held in Dallas in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X