వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్థానిక గాయనీ గాయకులకు ‘స్వరమంజరి' అనే పాటల పొటీల కార్యక్రమం గత ఐదు నెలలుగా నిర్వహించింది. ఇందులో భాగంగా ‘స్వరమంజరి'- ఆఖరి ఆవృత్తం, డిసెంబర్ 5న డల్లాస్‌లోని ‘జాక్ షింగ్లీ' ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.

టాంటెక్స్ స్వరమంజరి పాటల పోటీలు ప్రతిభకు పట్టం కట్టింది. ఐదు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. ప్రత్యేకించి స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ‘స్వరమంజరి' పాటల పోటీలు రసఙ్ఞ ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది.

అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా టాంటెక్స్ రూపొందించిన ఈ పాటల పోటీల ద్వారా సంగీతం అభ్యాసకులే కాక సాధారణ సగటు శ్రోతల్లో కూడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వ్యక్తమయ్యింది. ఎలాంటి ప్రవేశ రుసుము, ఆర్ధిక లాభాపేక్ష లేకుండా టాంటెక్స్ వంటి మేటి సాంస్కృతిక సంస్థ ఈ పోటీలను నిర్వహించి ఆదర్శంగా నిలిచింది.

ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ముఖ్య అతిధి, ప్రధాన న్యాయనిర్ణేత, చలన చిత్రాల గేయ రచయిత, చంద్రబోస్, సంగీత దర్శకులు, స్థానిక న్యాయనిర్ణేతలు రాజశేఖర్ సూరిభోట్ల, శ్రీనివాస్ ప్రభల, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి, టాంటెక్స్ కార్యదర్శి మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి చినసత్యం వీర్నపు, కోశాధికారి కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి వేణు పావులూరి, కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, శ్రీలక్ష్మీ మండిగ, శ్రీనివాస్ రెడ్డి గుర్రం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు ఇందు పంచార్పుల, జయ తెలకలపల్లి, పల్లవి తోటకూర, నరేష్ సుంకిరెడ్డి, పవన్ గంగాధర్, వెంకట్ కోడూరి, రవితేజ పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సంధ్య అబ్బూరి, అశ్విన్ కౌత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

స్వరమంజరి పాటల పోటీ మొదటి ఆవృత్తంలో 25 మంది కళాకారులు తలపడగా చివరి అంకానికి వచ్చేసరికి ఆరుగురు పోటీకి తలపడ్డారు. మొదటి ఆవృత్తంలో గాయనీ గాయకుల పాట,కు చివరి ఆవృత్తంలోని పాడే విధానానికి ఎంతో మార్పు ప్రస్పుటంగా కనిపించింది. టాంటెక్స్ వారి స్వరమంజరి బ్యానర్‌లో ‘Take your singing Good to Great' అనేది తప్పక న్యాయం చేకూరింది. సాధన, పట్టుదల అనేవి ఉంటే ఏదైనా సాధించగలం అనేది మరొక్కసారి రుజువయ్యింది.

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్థానిక గాయనీ గాయకులకు ‘స్వరమంజరి' అనే పాటల పొటీల కార్యక్రమం గత ఐదు నెలలుగా నిర్వహించింది. ఇందులో భాగంగా ‘స్వరమంజరి'- ఆఖరి ఆవృత్తం, డిసెంబర్ 5న డల్లాస్‌లోని ‘జాక్ షింగ్లీ' ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి పాటల పోటీలు ప్రతిభకు పట్టం కట్టింది. ఐదు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. ప్రత్యేకించి స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది.

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ‘స్వరమంజరి' పాటల పోటీలు రసఙ్ఞ ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది.

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా టాంటెక్స్ రూపొందించిన ఈ పాటల పోటీల ద్వారా సంగీతం అభ్యాసకులే కాక సాధారణ సగటు శ్రోతల్లో కూడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వ్యక్తమయ్యింది. ఎలాంటి ప్రవేశ రుసుము, ఆర్ధిక లాభాపేక్ష లేకుండా టాంటెక్స్ వంటి మేటి సాంస్కృతిక సంస్థ ఈ పోటీలను నిర్వహించి ఆదర్శంగా నిలిచింది.

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

ఈ పాటల పోటీలకు ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సంధ్య అబ్బూరి, అశ్విన్ కౌత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

టాంటెక్స్ స్వరమంజరి విజయభేరీ

స్వరమంజరి పాటల పోటీ మొదటి ఆవృత్తంలో 25 మంది కళాకారులు తలపడగా చివరి అంకానికి వచ్చేసరికి ఆరుగురు పోటీకి తలపడ్డారు. మొదటి ఆవృత్తంలో గాయనీ గాయకుల పాట,కు చివరి ఆవృత్తంలోని పాడే విధానానికి ఎంతో మార్పు ప్రస్పుటంగా కనిపించింది.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరుగా ఉన్నతమైన వృత్తిని చేపట్టిన డా. నరసింహారెడ్డి ఊరిమిండి ప్రవృత్తి రిత్యా కళాపిపాసి కావడంతో ఇటువంటి వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సంస్థలో గత పాతిక సంవత్సరాలుగా సేవలందిస్తున్న డా. నరసింహారెడ్డి అధ్యక్షస్థానాన్ని అధీష్టించిన తరువాత ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరి మన్ననలను అందుకున్నారు.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

స్వరాభిషేకం, స్వరమంజరి, స్వరమాధురి, వసంతగాన సౌరభం, సాహిత్య వేదిక, మైత్రి, వనితా వేదిక, ఉగాది ఉత్సవాలతోపాటు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలను అమెరికాకు ఆహ్వానించి వారి ప్రదర్శనలను ఏర్పాటు చేయటం ఆయనలోని కళాపోషణకు నిలువెత్తు నిదర్శనం. వారితో కొన్ని ముచ్చట్లు...

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

టాంటెక్స్ సంస్థతో మీకున్న అనుబంధం?

పాతిక సంవత్సరాలక్రితం అమెరికాలో ఒక స్టూడెంట్‌గా అడుగుపెట్టాను. అప్పుడు టాంటెక్స్ సంస్థ గురించి తెలుసుకొని ఐదు డాలర్ల స్టూడెంట్ మెంబెర్ షిప్‌తో ప్రయాణం మొదలు పెట్టి, సంస్థతో అనుబంధం పెంచుకుని గత పాతిక సంవత్సరాలుగా పనిచేసి, ఈ అధ్యక్షత స్థానానికి చేరుకున్నాను. రెప్పపాటు సమయంలో తెలియకుండానే జరిగిపొయాయి.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

అధ్యక్షత స్థానాన్ని అధీష్టించటానికి పాతిక సంవత్సరాలు పట్టడానికి కారణం?

నేను వచ్చిన ఐదు సంవత్సరాలికే నాకు పదవిని అధీష్టించమని టాంటెక్స్ సంస్థవారు అడిగారు. ఆ రోజుల్లో ఎన్నికలు ఉండేవి కాదు. కానీ నా ముందు చాల మంది పెద్దవారు ఉండటం చేత వారికి ముందు అవకాశం వస్తే బాగుంటుందనీ, పదవీ కాంక్ష కన్నా కూడా సేవ చెయ్యాలనే సదుద్దేశ్యంతో ఉన్నాను. కానీ, ఇప్పుడు పదవి ఉన్నప్పుడు మరికొన్ని మంచి కార్యక్రమాలు చేసే ఆలోచన, అవకాశం ఉంటుందని ఈ సంవత్సరం అధ్యక్షత స్థానాన్ని చేపట్టాను.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

ఈ పాతిక సంవత్సరాల వ్యవధి లో ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచుకున్న మీరు సంస్థ నుండి, ఇతర సభ్యులనుండి ఏమైనా నెర్చుకున్నారా?

నిబద్ధత, క్రమశిక్షణ, సందర్భానికి కావాల్సిన పరిఙ్ఞానం, వంటి ఎన్నో విషయాలను నేర్చుకొవటం జరిగింది.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

మీరు సమయం సెకెండ్లతో సహా చాలా చక్కగా పాటిస్తారు. సమయానికి మీరు ఇచ్చే విలువ?

కాలం చాలా విలువైంది. అటువంటి కాలాన్ని జనం వృథా చేస్తారు. చాలా కార్యక్రమాల్లో ఇచ్చిన సమయం కంటే ఒక గంట ఆలస్యంగా జనం రావటం జరుగుతుంది. సంస్థలోని ప్రతి వ్యక్తి తన బాధ్యతను గ్రహించి, కాలాన్ని వృథా చేయకుండా సమయాన్ని పాటిస్తే సంస్థకు, సమాజానికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఇటువంటి మంచి కర్యక్రమాలు చేయటంలో గత అనుభవం తోడైందా లేక మీ సొంత ఆలోచనలతో కూడుకున్నటువంటిదా?

ఏ పనిలోనైన పరిఙ్ఞానం సంపాదించాలంటే గతంలో జరిగిన కార్యకమాలను చూసి నేర్చుకోవటం అలాగే అందులోనున్న లోటు పాట్లను తెలుసుకొని, ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకుని, వీటికి సొంత ఆలోచనలను జోడించి కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది. ప్రకృతిలో ప్రతి అంశం నేర్చుకోతగినదే! నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. అందు చేత నేను ఎప్పుడు చెప్తాను "సేవ చేసే ప్రతి అవకాశం సేవకుల సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ అవకాశం" అని. సంస్థలో పని చేయటం వల్ల పరిఙ్ఞానం తోపాటు ఆత్మస్థైర్యం కూడా పెరిగింది.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

స్వరమంజరి, స్వరమాధురి వంటి కార్యక్రమాలు అన్నీ సంగీతానికి సంబంధించీ అలాగే సాహిత్య వేదికలో ఎంతోమంది ప్రముఖులను పిలిపించి వారిచే ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తున్నారు కళాకారులకు. మరి నృత్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు దానికి మీరు ఏమంటారు?

ఇది చాలా చక్కని ప్రశ్న అండి. గతంలో మేము నాట్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రత్యేకించి కార్యక్రమాలను చెయ్యలేదు. ఇకముందు తప్పక నృత్యానికి కూడా మంచి ప్రాధాన్యత ఉండేలా మంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పక ప్రయత్నిస్తాం.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

ఇటీవల టాంటెక్స్ సంస్థ నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు మరి అలాగే ఇక ముందు మీ ఆధ్వర్యంలో అటువంటి కార్యక్రమాలు ఎమైనా చేసే ఉద్దేశ్యం ఉందా?

స్వరాభిషేకం ఒక మాహా యఙ్ఞం. నాలుగువేలమంది అశేష జనం, డెబ్భై మంది పోషక దాతలు, చేయూతనిచ్చిన పదహారు సంస్థలు, ఆర్దికంగా కూడా అంత పెద్ద కార్యక్రమాలు చెయ్యాలంటే వెంట వెంటనే చెయ్యటం చాల కష్టం. కాకపోతే కొంచెం భిన్నంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:

చివరగా ఈ సంవత్సరం లో ఇంకా ఇది చేసుంటే బాగుంటుంది కానీ చెయ్యలేకపోయాను అనీ, రాబోయే తరాల వారికి మీరు ఇచ్చే సూచన సందేశం?

స్వరమంజరి, స్వరమాధురి, కార్యక్రమాలేకాక, దీపావళి వేడుకల్లో మొబైల్ యాప్ రిలీజ్ చేశాము. ముఖ్యంగా మహిళలకు ఆటల పోటీలు పెట్టాము. అలాగే వృద్ధులకు కుడా కొన్ని కార్యక్రమాలు చేశాము. విశ్వవిద్యాల్లోని విద్యార్థులకు ఏ విధంగా దగ్గర కావాలో ప్రయత్నిస్తున్నాము. ఇక భావి తరాల వారు బాధ్యతలను మర్చిపోవద్దు. నేర్చుకోవాలి, పని చేయాలి, పని చేయించాలి, అందరికీ అందుబాట్లో ఉండాలి. అలాచెయ్యటం మా వల్ల కాదు అంటే వేరే వారికి సేవ చెయ్యటానికి అవకాశం ఇవ్వండి .

మీ(డా. నరసింహారెడ్డి ఊరిమిండి) అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా పాఠకులకు మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదలు. నమస్కారం -టాంటెక్స్ స్వరమంజరి కార్యక్రమంపై డా. సుధ కలవగుంట సమర్పించిన నివేదిక.

టాంటెక్స్ అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ.. ‘స్వరమంజరి కార్యక్రమానికి ఇంతవరకు అనూహ్య స్పందన లభించింది. స్థానికుల గాయనీ గాయకుల ప్రతిభా ప్రదర్శనకు ఇది ఒక సరికొత్త వేదిక. గాయనీ గాయకులలో పాట బాగా నేర్చుకోవాలన్న తపన పెరగడం, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టం కావడం, వారి మనోస్థైర్యం మరింత పెరగడం వంటి మార్పులు మన తెలుగు సంస్కృతికి సోపాన మార్గాలు' అని అన్నారు.

చివరి ఆవృత్తంలో ప్రభాకర్ కొట, పూజిత కడిమిసెట్టి, ఆషాకీర్తి లంక, సంగీత మరిగంటి, సాయిరాజేష్ మహాభాష్యం, జానకి శంకర్, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. ఈ పొటీలో ప్రధమ స్థానంలో జానకి శంకర్ బంగారు పతకం, ద్వితీయ స్థానంలో సాయి రాజేష్ మహాభాష్యం రజిత పతకం, తృతీయ స్థానంలో పూజిత కడిమిసెట్టి కాంస్య పతకం గెలుచుకున్నారు.

సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు బాల గణపవరపు ఆడియో అందించగా, బాలు వీడియో, ఫొటోగ్రాఫి ప్రవీణ్ యార్లగడ్డ అందించారు. మధ్య మధ్యలో నర్తకి రూపా బంద నిర్వహణలో వారి బృందంచే యమునా తరంగం యతిరాజు తారంగం యదలోని తాళం ఒకటే కులం, శివ పూజకు చిగురించిన, దేశమంటే మనుష్యులోయ్ వంటి పాటలకు చక్కటి ఆంగికాభినయంతో తాళ లయ విన్యాసాలతో నృత్యాన్ని ప్రదర్శించారు.

టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు. చివరగా వందన సమర్పణలో ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి.. స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలకు, స్వరమంజరి పాటల పోటీల విజేతకు బంగారు పతకాన్ని అందించిన తన్మయీ జ్యువెల్లర్స్‌కు, కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Tantex Swaramanjari programme has held in Dallas on 5th December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X