వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), యూలెస్లోని ట్రినిటిహైస్కూల్‌లో వసంత కోయిల తీయనిరాగాన్ని ఆలపించగా మన్మధనామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, కనువిందైనఅలంకరణలతోమన తెలుగువారి ఆటపాటల నడుమ టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండినరసింహారెడ్డి ఈ కార్యక్రమ సమన్వయకర్త కనపర్తి శశికాంత్ అధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త పాలేటిలక్ష్మి పర్యవేక్షణలో ఉగాది ఉత్సవాలు ఆనంద డోలికల్లో ఊయలలూగించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగావిచ్చేసిన శ్రీలక్ష్మి తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

షడ్రుచుల ఉగాది పచ్చడిని, తేనీరు, అల్పాహారంతో కనువిందైనకమ్మనిఫలాలను, అలాగే నలభీముని వంటను తలపిస్తూ ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక "బావర్చి" రెస్టారెంట్ వారు వడ్డించి ‘భళా బావర్చి' అనిపించుకున్నారు.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

ఈ ఉగాది పర్వదినోత్సవానికి 20లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు00 మంది తెలుగువారు హాజరుకాగా సుమారు 400 మందిపిల్లలు మరియు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని దొరకునా ఇటువంటి కళాసౌరాభం అన్నవిధంగా అందరినీఅలరించారు. ఇదంతా ఒక ఎత్తయితే మన మాతృభూమినుండి విచ్చేసిన ఉత్తమ కళాకెరటం యువగాన గంధర్వుడు ఇండియన్ ఐడల్ ‘కారుణ్య', అలాగే కోయిల గాత్రాన్ని తమ కంఠములో నిలుపుకున్న‘ఆదర్శిణి', కెనడా నుండి విచ్చేసిన ‘హనిష్క' ఆలపించిన పాటలు సంగీత ప్రియులను పరవసింపజేసాయి.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

టాంటెక్స్ నిర్వహించిన "వసంతగాన సౌరభం"లో పాల్గొని, విజేతలైన బాలబాలికలు కూడా వీరితోపాటు సంగీత స్వరరాగాలతో వీక్షకులను అలరించారు. ఉగాది సందర్భంగా త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీవద్దిపర్తి పద్మాకర్గారు తెలుగువారు ఆతృతగా చూసే పంచాంగ శ్రవణం అందించారు.
డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు


ఈ ఉగాది ఉత్సవాలు "అమెరికా జాతీయ గీతంతో" ప్రారంభమై తదుపరి "మూషికవాహన" శ్లోకానికిఆంగికాభినయాన్నిచేకూర్చికందిమల్లజ్యోతి శిష్యులు చేసిన ప్రార్థనానృత్యం, గుడిమెల్లస్వప్న శిష్యుల "గణపతి బప్పా మోరియ", నవ్వుల శ్రీదేవి నృత్య రూపకం,"మన తెలుగు" అంటూ చేసిన జానపదగీతం, చావలి హేమమాలిని శిష్యబృందం నర్తించిన "అన్నమయ్య" శాస్త్రీయ నృత్యము, పడిగెలసంజన ఆకట్టుకున్నాయి.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

వసల్ శ్వేత నిర్వహించిన నవ్య నూతనమైన "సినిమా గిమ్మిక్కులతో", ప్రభలశ్రీనివాస్రచించిరూపొందించిన "ఫేస్బుక్ఫేస్మండ" నాటిక, డా. కలవకుంటసుధ, శిష్య బృందం ప్రదర్శించిన "భక్తమార్కండేయ" నృత్య నాటిక,శొంఠిపద్మ,సూరిశ్రీలత శిష్య బృందం చేసిన శాస్త్రీయ నృత్యాలు ఇలా మరెన్నెన్నో ప్రదర్శనలు టాంటెక్స్ ఉగాది వేదికను ఇంద్రభవనమును తలపింపచేస్తూ, కనురెప్పకి పని చెప్పకుండా మంత్రముగ్ధులను చేస్తూ ప్రేక్షకులను మైమరపించాయి.

 డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు


సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలోకార్యవర్గ సభ్యులందరి సంపూర్ణ సహకారంతో, 2015వ సంవత్సరంలో "ప్రగతి పథంలో పది సూత్రాలు" గమ్యంగా, సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మనసభ్యుల అవసరాలకు అనుగుణంగా మన సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుతున్నాము అని వివరించారు.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

కార్యక్రమాల నాణ్యత పెంచడం కోసం ఈ ఉగాదికి ప్రత్యేకంగా స్థానిక కార్యక్రమాలు, చక్కటి పిచ్చాపాటి కబుర్లతో విందు భోజనం, అనంతరం గాయకుడు కారుణ్య బృందంతో కచేరిని ఏర్పాటు చేసాము. స్థానిక కళాకారులకు ప్రత్యేక వేదికలు కల్పించడం కోసం ఇటీవల 50 మంది చిన్నారులతో "వసంత గానసౌరభం" నిర్వహించడమే కాకుండా, ఈ వేసవిలో పెద్దలకు అవసరమైన "పాటల పల్లకీ"లుఏర్పాటు చెయ్యడానికి సిద్దంగా ఉన్నాము.

 డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు


మహాదాత డా. ప్రేమ్ రెడ్డి టాంటెక్స్సంస్థకు ఇరవై ఐదువేల డాలర్ల విరాళంతో "డైమండ్ స్పాన్సర్" గా చేయూతనివ్వడమే కాకుండా నాటా సంస్థకు "డైమండ్ స్పాన్సర్" హోదాను కలిపించారు. శ్రీమతి ఇందిర/అజయ్ రెడ్డి గారు మూడవ "డైమండ్ స్పాన్సర్" గా సంస్థకు ఆర్ధిక సహాయం అందించడం ఆనందంగా ఉందనిఅన్నారు. దాదాపు ముప్పై మంది ఉగాది పోషక దాతలు ముందుకు రావడం విశేషం. టాంటెక్స్ సీజన్ పాస్ ద్వారా సగటు కుటుంబం 60 శాతం వరకు పొదుపు చేసుకోవచ్చు కావున అందరూ ఇందులో భాగస్వామ్యం తీసుకోవాలని అధ్యక్షులు కోరారు.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2015 "ఉగాది పురస్కారాల'ను ఈ సంవత్సరం సాహిత్యం,విద్యా,సాంకేతిక,వైద్య, రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు.తెలుగు సాహిత్య రంగంలో డా. వంగూరి చిట్టెన్ రాజుగారికి, విద్యారంగంలోడా.బి.పి.ఎస్ మూర్తిగారికి, సాంకేతికరంగంలో ఎం.వి.ల్ ప్రసాద్ గారికి, వైద్యరంగంలో డా.చొల్లేటిరాజనరేందర్గారికి ఈ పురస్కారాలను అందచేశారు.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న,దిండుకుర్తి నగేష్,మాదాల రాజేంద్ర,సుంకిరెడ్డి మాధవి, బండారు సతీష్ లకు ‘ఉత్తమ స్వచ్ఛందసేవకుడు(బెస్ట్ వాలంటీర్) 'పురస్కారంతో సత్కరించి వారి సేవాధృక్పదాన్ని పలువురికి చాటారు. "వనితావేదిక" బృంద సభ్యుల ఆధ్వర్యంలో ,తెలుగు సాంప్రదాయ వస్త్ర ధారణకి నిలువుటద్దంగా నిలిచిన వారిని ఎంపిక చేసి, బహుమతులను ప్రదానం చేసి తెలుగుతనానికి వన్నెతెచ్చారు.

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

డల్లాస్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

విచ్చేసిన కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా కారుణ్యకు "గాన తపస్వి" బిరుదుతో, ఆదర్శిణి, హనిష్క, శ్రీలక్ష్మి లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందం సత్కరించారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

English summary
Tantex Ugadi Utsavalu in Dallas 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X