• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో టీడీపీ అవిర్భావ దినోత్సవ వేడుకలు

|
Google Oneindia TeluguNews

కువైట్: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రంగ రంగ వైభవంగా కువైట్లోని పలు ప్రాంతాలలో కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న కోవిడ్ నిబందనలకు అనుగుణంగా ఎక్కువ అభిమానులు ఒకేచూట గుమ్మిగూడకుండా కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఈ వేడుకలను చేసుకున్నారు.

అబుహలిఫా, ఫహాహీల్, మహబూలా, సాల్మియా, హవల్లీ, ఖాద్సియా, ఫర్వానియా, ఆర్దియా ప్రాంతాలలో ఆయా ఏరియాలలో ఉన్న టీడీపీ అభిమానులతో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం కువైట్ పీఆర్వో మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. మహానుభావుడు అన్న నందమూరి తారకరామారావు చేతుల మీదుగా "తెలుగు వాడి ఆత్మగౌరవం" కోసం 40 ఏల్ల క్రితం స్తాపించబడ్డ ఈ పార్టీ ఎన్నో సంక్షేమ పధకాలను పేదలకోసం ప్రవేశపెట్టి దేశంలోనే ముందు ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకోసం అనునిత్యం పోరాడుతూ ప్రభుత్వంపై ప్రజలకోసం యుద్దం చేస్తుందన్నారు.

 TDP foundation day celebrations held in kuwait by Telugu Desam Party Kuwait

ఆ తర్వాత తెలుగుదేశం కువైట్ అధికార ప్రతినిధి షేక్ బాషా మాట్లాడుతూ.. అన్న నందమూరి రామారావు పార్టీని 13 సంవత్సరాలు నడిపితే, తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రన్న గత 27 సంవత్సరాలుగా పార్టీని ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు అని అన్నారు. ఆయన తన విజన్‌తో అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఇప్పుడు విడిపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని ఎన్నోవిధాలుగా అభివృద్ది పరిచారని అన్నారు.

మరో అధికార ప్రతినిధి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ అంటూ ప్రజలని బ్రతిమాలి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల సంక్షేమాలను విస్మరించి దోచుకోవటమే పనిగా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్ళ వెనక్కి పోయింది, అందరం ఈ విషయాన్ని గమనించి 2024లో చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయాల్సిన అవసరం ఎంతయినా ఉంది అన్నారు.

తెలుగుదేశం కువైట్ తెలుగు యువత అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 2024లో మనం అందరం వెళ్ళి, మనకి తెలిసినవారి ద్వారా ఎన్నికల్లో వోట్లువేయించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేవాలని కోరారు. ఆ తర్వాత తెలుగుదేశం కువైట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ చాన్ బాషా మాట్లాడుతూ.. మా దేహంలో వుంది పసుపురక్తం అని, తుదిశ్వాస విడిచే వరకు మేము పార్టికోసం పనిచేస్తామని అన్నారు.

తెలుగుదేశం కువైట్ గౌరవ సలహాదారులు, పెద్దలు యెనిగళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ.. విదేశాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ఇలా నిర్వహించటం సంతోషం అంటూ అందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. అన్ని చోట్ల కేక్ కటింగ్‌తో కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో రావి వెంకట రమణ, కొత్తపల్లి భవాని ప్రసాద్, బల్లపురం మల్లయ్య, తుమ్మల వెంకటేశ్వర రావు, వంశీ కృష్ణ కాపెర్ల, శివ మంచూరి, కుటుంబ రావు, కొల్లి ఆంజనేయులు, ఫర్వానియా బాలా, ఖాద్సియ నరసిమ్హ తదితరులు పాల్గొన్నారు.

English summary
TDP foundation day celebrations held in kuwait by Telugu Desam Party Kuwait.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X