వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా ఎన్నారై టీడీపీ కువైట్ శంఖారావం: మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు

|
Google Oneindia TeluguNews

కువైట్‌లో ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శంఖారావం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు బలరాం నాయుడు, కుదరవల్లి సుధాకర రావు, నాగేంద్ర బాబు, మొహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నాడు రాత్రి కువైట్ శంఖారావం నిర్వహించారు.

 శంఖారావానికి హాజరైనవారు

శంఖారావానికి హాజరైనవారు

స్వదేశంలో ఎన్నికల ప్రచారానికి ధీటుగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్, సీ ఆదినారాయణరెడ్డి, శాసనసభ సభ్యులు గొల్లపల్లి సూర్యారావు మరియు ఆరిమిల్లి రాధాకృష్ణ ఇతర నాయకులు బత్యాలచెంగలరాయులు, దూదేకులఫెడరేషన్ కార్పోరేషన్ చైర్మన్ బాబన్, ఎస్సీ మరియు ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని, చిత్తురు జిల్లా నాయకులు అశోక్ రాజు, మల్లారపు రవిప్రకాష్, ఎన్నారై టీడీపీ నాయకులు వేమూరి రవి తదితరులు విచ్చేసి మాట్లాడారు.

కేంద్రం, వైసీపీ అడ్డుపడుతోంది

కేంద్రం, వైసీపీ అడ్డుపడుతోంది

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారితోపాటుగా ప్రవాసీయుల సంక్షేమానికీ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగున కేంద్రం మరియు వైసీపీఅడ్డంకులు, అవరోధాల సృష్టిస్తున్నాయన్నారు. నూతన రాష్ట్రం సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఆత్మస్థైర్యంతో, చిత్తశుద్ధితో రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు.

ఏపీ నుంచి పలువురు నేతలు హాజరు

ఏపీ నుంచి పలువురు నేతలు హాజరు

ఈ కార్యక్రమంలోపాల్గొనడానికి మొత్తం 22 మంది ప్రత్యేకంగా అంధ్ర నుండి వచ్చారు. శుక్రవారం కువైట్ సెలవు కావడంతో పెద్దసంఖ్యలో పార్టీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా కడప, జమ్ములమడుగు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభిమానులు ప్రత్యేకించి సామాజికవర్గాల వారీగా విడిగాసమావేశాలునిర్వహించుకున్నారు.

లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

ఈ కార్యకమములో భాగంగా నారా లోకేష్‌...ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ది, అందులో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి వివరించారు. కాగా, గురువారం వీరంతా భారతీయ ఎంబసీకు వెళ్ళి కువైట్లోని భారతీయ రాయబారి కె.జీవసాగర్‌ను కలిసి వారితో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.

English summary
Telugudesam Party NRI Sankaravam in kuwait in friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X