వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్టర్ ఆవిష్కరణ: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకె

రోజు నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రముఖ కవి నందిని సిద్ద రెడ్డి గారు,సంస్థ ప్రతినిధులు నవీన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూకే‌లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ బిడ్డలందరని ఏకం చేస్తూ త్వరలో ప్రారంభించబోతున్న తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆవిర్భావ సభ
పోస్టర్ ని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారు నేడు హైదరాబాద్ సామాజి గూడ ప్రెస్ క్లబ్ లో
ఆవిష్కరించారు.

సంస్థ ప్రతినిధి నవీన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ఉద్యమంలో లండన్ వేదిక మా వంతు బాధ్యత
నిర్వహించామని, నేడు అదే స్పూర్తితో యూకే నలుమూలల ఉన్న ప్రవాస తెలంగాణ బిడ్డలందరిని కలుపుకొని ఒక వేదికగా ఏర్పడి, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం, రాష్ట్రంలో ఎన్ని సేవ కార్యక్రమాలు చేయడం మరియు బంగారు తెలంగాణ నిర్మాణం లో బాధ్యత నిర్వహించడం వంటి ఎన్నో ఆశయాలతో ఇది ప్రారంభిస్తున్నామని, సహకరించిన మీడియా మిత్రులకి, తెలంగాణ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 Telangana Association UK Poster

ఈ నెల జనవరి 28 న లండన్ ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని,
అతిధులుగా రాష్ట్రం నుండి ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారు, కట్ట శేఖర్ రెడ్డి గారు మరియు స్థానిక యూకే రాజకీయ ఇతర ప్రభుత్వ ప్రతినిధులు, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

ఈ రోజు నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రముఖ కవి నందిని సిద్ద రెడ్డి గారు,
సంస్థ ప్రతినిధులు నవీన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్ చైర్మన్ కరాటే రాజు, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ,మల్లేష్ యాదవ్, ప్రవీణ్
కుమార్, శశిధర్ చేబర్తి, వసుంధర, తెలంగాణ సోషల్ మీడియా నాయకులు కరుణాకర్
రెడ్డి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ నాయకులు తిరుమందాస్ గౌడ్ మరియు తెలంగాణ సామాజిక నాయకులు ఫణికుమార్ పాల్గొన్నారు.

English summary
Telangana association UK poster was released by well known telangana poet Nandini Sidhareddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X