• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రవాస రచయితలకు కథ కవితల పోటీలు నిర్వహిస్తోన్న శాక్రమెంటో తెలుగు సంఘం

|

రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటో కేంద్రంగా క్యారకలాపాలు నిర్వహిస్తున్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) "శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ " నిర్వహించనుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతోంది. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తికి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో పరిసర ప్రాంతాలలో విశేష కృషి చేస్తోంది. అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా తదితర విదేశాలలో నివసించే తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీ ప్రధాన విభాగంలో జరుగుతుంది. ప్రవాసులు కానివారు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం తమ రచనలు ఇక్కడ ఇచ్చిన మెయిల్‌కు telugusac@yahoo.com పంపాలని కోరుతోంది.

ఇక చివరిగా ముగ్గురు విజేతలను ప్రకటించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ కథానిక విభాగంలో ముగ్గురు విజేతలను ప్రకటిస్తారు. ప్రథమ విజేతకు $116, రెండవ స్థానంలో నిలిచిన విజేతకు $58, మూడవ విజేతకు $28 బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ కవిత విభాగంలో కూడా మూడు విజేతలను ప్రకటించడంతో పాటు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.

Telugu Association of Greater Sacramento invites applications for essay competition

ఇక పోటీలో పాల్గొనాలనుకునే వారు ఈ కింది ముఖ్య గమనికలు ఒక సారి చూడాల్సి ఉంటుంది.

ఒక రచయిత ఒక్కో పోటీ లో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.

రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి.

"ప్రధాన విభాగం" పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి. ప్రధాన విభాగంలో స్వీయ రచనలు పంపాలి. ప్రధాన విభాగంలో అనువాద కథలు, అనువాద కవితలు అనుమతింపబడవు.

Telugu Association of Greater Sacramento invites applications for essay competition

హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్ లోడు చేసుకొనగలరు: https://tinyurl.com/tagsform :: డౌన్ లోడు చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.

రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రం లో ఆవివరాలు రాస్తే సరిపోతుంది.

మీ రచనలను తెలుగులో టైపు చేసి Microsoft Word లో పంపితే బాగుంటుంది. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువ శక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.

బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net),సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక "సిరిమల్లె" http://sirimalle.com , స్వర రేడియో మరియూ స్వరపత్రిక https://magazine.swara.media/ మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక http://sactelugu.org/tags-patrika/ లో ప్రచురించబడతాయి.

విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2021 పండుగ కు ముందు ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు పంపరాదు, ఇంకెక్కడా ప్రచురించ కూడదు.

Telugu Association of Greater Sacramento invites applications for essay competition

కాలిఫొర్నియా రాష్త్రంలో నెలకొనిఉన్న శాక్రమెంటో నగరం లో, జనవరి 2021 న జరగబోయే TAGS 17వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభా ముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి, రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. కోవిడ్ మహమ్మారి మూలంగా ఒకవేళ సంక్రాంతి సభ నిర్వహణ ప్రత్యక్ష్యంగా సాధ్యం కాకపోతే, ఆన్ లైను సదస్సులో బహుమతి ప్రదానం నిర్వహించడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం.

Telugu Association of Greater Sacramento invites applications for essay competition

విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం

ఇక మీ రచనలు అందవలసిన చివరి తేదీ: నవంబర్ 30, 2020

మీ రచనలను ఈ మెయిల్‌ telugusac@yahoo.comకు Microsoft wordలో పంపండి.

English summary
Telugu Association of Greater Sacremento is conducting Poem competition in the view of Sankaranti 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X