• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సౌదీలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు

|

సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఉన్న జెడ్డా తెలుగు సంఘం వారు ఎడారి ప్రాంతమైన గల్ఫ్ దేశాలలో మొట్ట మొదటిగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు జరిపి మన తెలుగు భాషా ప్రాముఖ్యతని చాటి చెప్పారు.

ప్రపంచం లోని ఇతర తెలుగు సంఘాలకు ధీటుగా జెడ్డా తెలుగు సంఘం వారు తెలుగు యొక్క ప్రాముఖ్యాన్ని ,గొప్పతనాన్ని , ఔనత్యాన్ని చాటి చెప్పారు. సౌదీ అరేబియా లోని జెడ్డా ,యాంబు, అల్ లిత్ ,రబీగ్ నగరాలలో నివసిస్తున్నటువంటి తెలుగు భాష ప్రేమికులైన మన రెండు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు .

గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా జరిగిన తెలుగు భాష దినోత్సవంలో కార్యక్రమానికి విచ్చేసిన అందరిని ఆహ్వానించిన విధానము, ప్రారంభ ఉపన్యాసము తెలుగు వారి అందరికి ఆప్యాయతని అందిచాయి .

సుమారు 2400 సంవత్సరాల ప్రాచీనత కలిగిన తెలుగు భాష చరిత్రని, తెలుగు భాషకి సంబంధించిన కవుల గురించిన విషయాలను, ప్రాచీన దశనుంచి ఆధునిక యుగము వరకు భాష పరిణామక్రమమునకు చెందిన తెలుగు సాహిత్య ప్రదర్శన తెలుగు వారిని అమితముగా ఆకట్టుకున్నది

Telugu language day grandly held in Jeddah

అద్భుతముగా సాగిన ఈ కార్యక్రమము లో సాంస్కృతిక కార్యక్రమాలైన ఖురాను ని ఉర్దూ మరియు తెలుగు లో చెప్పుట , తెలుగు తల్లి పాట , మా తెలుగు తల్లి చిన్న పిల్లల నృత్య ప్రదర్శన , మృదంగమము ,అద్భుతమైన రెండు క్లాసికల్ పాటలు , తెలుగు జానపద నృత్యం మరియు తెలుగుకూచిపూడి నృత్యం ,తెలుగు ప్రత్యేక పాట , క్లాసికల్ సాంగ్ , తెలుగు జాతి మనది చిన్న పిల్లల కార్యక్రమము,తెలుగు కవితము,చిన్నపిల్లలతెలుగు పద్యాలు , వన్స్ మోర్ అనిపించిన పాటలు మరియు చివరి లో తెలుగు భాష గొప్పతనం పాట అందరిని అలరించాయి.

టీఏజే అధ్యక్షులు శ్రీ యూసుఫ్ అలీ గారు తమ ప్రసంగం లో లక్ష మంది పైగా తెలుగు వారు ఈ పశ్చిమ
సౌదీ లోవృత్తి రీత్యా స్థిర పడ్డారని తెలుగు వారి కి అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో తెలుగు సంఘ స్థాపన
జరిగిందని వివరించారు,

తెలుగు వారు మంచి హోదా లో ఉన్నారని , తోటి తెలుగు వారికీ సహాయం చేసేందు ముందుండాలని కోరారు,కుల మాత జాతి భేదాలను మర్చి మనమంతా తెలుగు వారమని పరస్పర సహాయ సహకారాలు అందించ్చుకోవాలని , మనమంతా బతుకుదెరువు కోసం ఇక్కడి కి వచ్చామని, మనం ముందు భారతీయులం ,ఆ తర్వాత తెలుగువాళ్ళం, ప్రేమించి ఆదరించడం మన సంస్కృతి అని మనం ఎప్పుడు మన సంస్కృతి ని మరవొద్దని సూచించారు

తెలుగు భాష పై ఉన్న మమకారంతో భాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు భాష కోసం సేవ చేసిన సయూద్దీన్ గారిని మరియు శ్రీ ఇర్ఫాన్ గారుల తో పాటు . తెలుగు సంఘ
ప్రతినిధులుగా తెలుగువారిని సమైక్య పరిచేందుకు కృషి చేస్తున్న కిరణ్ (యంబు). షబ్బీర్ (అల్ లిత్) ,వైకుంఠరావు (రబీగ్) కూడా సత్కరించారు

ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన sayeeduddin శ్రీ ఇర్ఫాన్ గారు మరియు అతిధులుగా విచ్చేసిన INDIAN forum అధ్యక్షులు శ్రీ అజాజ్ గారు, మరియు తమిళం సంఘం అధ్యక్షులు శ్రీ సిరాజ్ గారు మరియు షమీమ్ కౌసర్ గారు తెలుగు భాష గొప్పతనాన్నికొనియాడారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన కిరణ్ (యంబు),షబ్బీర్ (అల్ లిత్),వైకుంఠరావు (రబీగ్) కూడా ప్రసంగిచారు. తెలుగు సంఘం తెలుగు వారిని కలిపేందుకు ఒక వారధి లాగ పని చేస్తుందని అది ఎంతో అభి నంద నీయమైన విషయమని అన్నారు. వహీద్ గారి గాన లహరి తో పాటు , శ్రీ లక్ష్మి, విజయ
లక్ష్మి గారు తెలుగు పాటలు ఎంతో ప్రశంసించబడ్డాయి. వీరంతా తెలుగు పాటలతో అలరించారు.

కార్య క్రమ నిర్వాహక భాద్యులు శ్రీ నానాజీ,భాస్కర్ ,జానీ గారితో పాటు కార్యవర్గ సభ్యులైన ,సాగర్, మొయిజ్, కారమతుల్లా , ,మస్తాన్ , అప్పారావు మరియు LV రావు గార్లు తెలుగు అతిథులందరికి చురుగ్గా సేవలందించడం అందరిని ముగ్దుల్ని చేసింది. కార్యక్రమములో అందరు దేశ భాషలందు తెలుగు లెస్స అని నినదించారు .

English summary
Telugu language day was grandly celbrated in Soudi arabia, Jeddah.On the occasion of Gidugu Ramamoorthi birth day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X